బాబుకు పేరుకు ముందు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని బిరుదులు ఆయన తగిలించుకోవచ్చు గాక. జనం మాత్రం ఆయన్ని  ప్రజలు  యూటర్న్ అంకుల్ అనే సదా  గుర్తుంచుకుంటారు. ఎందుకంటే బాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్ని టర్నులు తిరిగారో ఎరిగిన వారు కనుకు. ఇక విభజన ఏపీలో బాబు ప్రత్యేక హోదా గురించి కూడా ఎన్నో రకాలుగా కధలు చెప్పారు. అది ఒకనాడు అవసరమన్నారు. మరోనాడు సంజీవనా అంటూ ఎకసెక్కం ఆడారు.

 

ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో జగన్ క్యాండిల్ ర్యాలీకి వెళ్తే కక్ష కట్టి మరీ అరెస్ట్ చేయించారు. ఏకంగా విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా ఇటు విమానం అటు తిప్పి పంపించారు. అటువంటి బాబు తరువాత కాలంలో ప్రత్యేక హోదా అంటూ ఊరూ వాడా తిరిగి మరీ  ర్యాలీలు తీశారు. అలా యూటర్న్ అంకుల్ అనిపించేసుకున్నారు.

 

అదంతా ఎందుకంటే ప్రత్యేక హోదా దెబ్బ విశాఖవాసులు అలా రుచి చూపించారు కాబట్టి. విశాఖలో జగన్ని అరెస్ట్ చేశాక కానీ బాబుకు హోదా మహత్తు ఏంటో తెలిసింది కాదు, ఇపుడు విశాఖ సహా మూడు రాజధానుల ప్రతిపాదనను  బాబు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఇదే విశాఖలో ఆయనకు విశాఖ జనం తమకు రాజధాని కావాలన్న కోరిక ఎంత బలంగా ఉందో చెప్పారు. బాబుని ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. బయటకు ఇదంతా వైసీపీ చేయించిన దాడిగా బాబు అంటున్నా ఆయన అనుభవం ఇది ప్రజాగ్రహం అని గ్రహించలేనిది కాదు.

 

దాంతో విశాఖ నుంచి వెళ్ళాక అయినా బాబు తప్పనిసరిగా విశాఖ సహా మూడు రాజధానులకు మద్దతు ఇస్తారని అంతా భావిస్తున్నారు. విశాఖకు బాబు జై అనే రోజు తప్పకుండా వస్తుందని అంతా అనుకుంటున్నారు.

 

దీనిమీద వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ బాబుకు విశాఖ దెబ్బతో తప్పకుండా బల్బ్ వెలుగుతుందని సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో బాబు విశాఖ మన రాజధాని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది అందరికీ అలవాటే అయినా కచ్చితంగా షాక్ తినేది మాత్రం అమరావతి వాసులే. ఇప్పటికే వారిని నడి సంద్రాన ముంచేసి టీడీపీ చాలా దూరం వచ్చేసింది. ఇక యూటర్న్ తీసుకోవడమే మిగిలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: