ఈ మధ్యకాలంలో జరిగిన ప్రమాదాలను గమనిస్తే ఎక్కువగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరుగుతున్నాయని తెలుస్తుంది.. తాగి తందనాలు ఆడేవారు వారి మానాన వారు వెళ్లక అమాయకులైన వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు.. ఇక వీకెండ్‌లో అయితే మద్యం మత్తులో యువత చేసే ఆగడాలు చెప్పలేనివిగా ఉంటాయి.. ఇలాంటి పరిస్దితుల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఏడాది రోడ్డు  ప్రమాదాల్లో మరణాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో  జనవరి నుంచి ఫిబ్రవరి 24వ తేదీవరకు చేపట్టిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దాదాపు 4,145 మంది మందుబాబులపై కేసులను నమోదు చేసి వారు నడిపిన వాహనాలు, కార్లు, ఆటోలు, డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు...

 

 

పట్టుబడిన వారిలో ఆరుగురు మైనర్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు. ఇక వారిపై కేసులను నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేయడంతో 662 మందికి శిక్ష పడింది. ఇదే కాకుండా  మద్యం మత్తులో జోగుతున్న యువతలో చాలామంది హెల్మెట్‌ పెట్టుకోకుండా, కారులో సీటుబెల్టు పెట్టుకోకుండా వాహనాలను అతివేగంతో నడిపిస్తూ రహదారులపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలా అతిగా మద్యం సేవించిన వీరు రోడ్లపై వాహనాలను నడిపించేందుకు అర్హులుకారని తేల్చి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దాదాపు 790మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేశారు.

 

 

ఇక డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబుల కౌంట్‌ చూస్తే పోలీసులకే బీపీ పెరిగిపోతుందట. 100మిల్లి లీటర్ల రక్తంలో 35గ్రాముల మోతాదు మద్యం ఉండాల్సి ఉండగా, కొంతమంది మందుబాబుల్లో బ్లడ్‌ అల్కాహాల్‌ కాన్‌సెంట్రేషన్‌ 550కి చేరుకుంటుందట. దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే ఇలాంటివారు సృహ లేకుండానే రోడ్లపై వాహనాలతో దూసుకుపోవడం చూస్తుంటే ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో అనే భయం వెంటాడుతుందట.. అందుకే బ్రదర్స్ ఇక నుండి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండని చెబుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: