క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ప్రచారమైతే అలాగే ఉంది. అంటే జయలలితకు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర పోలికలున్నాయి లేండి. అదేమిటంటే ఇద్దరూ మహా మొండోళ్ళే. ఒక పట్టాన ఇద్దరు కూడా ఇంకోళ్ళు చెబితే వినేరకాలు కాదు. ఇపుడు తాజగా వినిపిస్తున్న పోలిక ఏమిటంటే సచివాలయం గురించే. తమిళనాడులో దివంగత నేత కరుణానిధి నిర్మించిన సచివాలయం, శాసనసభలను జయలిలత ఏమి చేసిందో తెలుసా ?

 

ఏమి చేసిందంటే  వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కరుణానిధి అత్యంత ఆధునిక సౌకర్యాలతో సచివాలయం, శాసనసభ నిర్మించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో  ఆయన ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన జయలలిత మాజీ సిఎం నిర్మించిన  అసెంబ్లీ, సచివాలయంలోకి అడుగు పెట్టటానికి ఇష్టపడలేదు. దాంతో ఆమె ఆ భవనాలను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చేసింది. మిగిలిన భవనాలను కూడా ఏదో ఓ ప్రభుత్వ భవనంగా మార్చేసింది.

 

ఇపుడు అమరావతిలో చంద్రబాబునాయుడు నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని కూడా జగన్ ఇదే విధంగా మార్చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదో తప్పని పరిస్ధితుల్లో జగన్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నర్మించిన తాత్కాలిక భవనాల్లో ఉంటున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిపోతోంది. అందుకనే వీలైనంత తొందరగా రాజధానిని విశాఖపట్నంకు మార్చేయటం ఖాయమని తేలిపోయింది.

 

కాబట్టి ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూడా ఆసుపత్రిగా మార్చేయబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ భవనం, ఉన్నతాధికారుల కోసం నిర్మించిన క్వార్టర్స్ అంటారా ? వాటినీ ఏదో  ఓ విధంగా ఉపయోగంలోకి తేకుండానే ఉంటారా ?  ఎందుకంటే ఆ చుట్టు పక్కలే కొన్ని విద్యాసంస్ధలు నడుస్తున్నాయి. అందులో  వందలాది మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వాళ్ళకి వసతి సౌకర్యాలు కావాల్సుంటుంది. లేదంటే కొన్ని ప్రైవేటు సంస్ధల్లోని ఉద్యోగులకు అద్దెలకిస్తారు లేండి. మొత్తానికి జయలలితనే జగన్ ఫాలో అవుతున్నట్లు అనిపించటం లేదూ

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: