మొన్న విజయనగరం జిల్లాలో జరిగిన ఓ బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓ మాటన్నాడు. తాను పోరాటం చేస్తున్నది చంద్రబాబునాయుడుతో కాదు ఎల్లోమీడియాతోనే అని.  తాజా పరిణామాలను బట్టి చూస్తే ఆ మాట ముమ్మాటికి నిజమనే అనిపిస్తున్నది. గురువారం ఉదయం చంద్రబాబు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన దగ్గర నుండి జరిగిన పరిణామాలను జగన్ చెప్పిన ఎల్లోమీడియా చిలవలు పలువలు చేసి చూపించింది.

 

రాజకీయంగా జగన్- చంద్రబాబు ఒకరిపై మరొకరు వంద ఆరోపణలు, విమర్శలు చేసుకుంటారుఅది వేరే సంగతి. కానీ నిష్ఫాక్షికమైన మీడియా ఏం చేయాలి  ? విషయాన్ని  ఉన్నది ఉన్నట్లుగా ప్రజెంట్ చేయాలి. తప్పొప్పులు భేరీజు వేసుకునే బాధ్యత జనాలదే. కానీ ఇక్కడ ఎల్లోమీడియా చేసిందేమిటి ?  విమానాశ్రయం బయట దాదాపు ఐదు గంటల హై ఓల్టేజ్ డ్రామా తర్వాత చంద్రబాబును పోలీసులు ఎయిర్ పోర్టు లాంజ్ లోకి  తీసుకెళ్ళారు.  

 

ఇంకేముంది ఎల్లోమీడియా రెచ్చిపోయింది. చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని ఓ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అంటూ  మొదలుపెట్టేసింది. మరో ఛానల్ ఏమో చంద్రబాబును అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్ళారో తెలీదంటూ ఊదరగొట్టేసింది. అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. టివిలు చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిందేమంటే చంద్రబాబును పోలీసులు లాంజ్ లోకి తీసుకెళ్ళారనే. మరి ఎల్లోమీడియా ఎందుకు తన పైత్యాన్ని చూపించింది. లాంజ్ లో కూర్చోపెట్టి ముందస్తు అరెస్టంటూ పోలీసులు ఓ నోటీసును చంద్రబాబుకు ఇచ్చారంతే.  

 

అంటే విశాఖపట్నం విమానాశ్రయంలో జరుగుతున్నదొకటి అయితే ఎల్లోమీడియా చెప్పింది మరొకటి అన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది అందరికీ. అంటే చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయాలని, పచ్చబ్యాచ్ మొత్తం రాష్ట్రమంతా రెచ్చిపోవాలని, రాష్ట్రంలో అల్లర్లు మొదలైపోవాలని బహుశా ఎల్లోమీడియా ఉద్దేశ్యం కావచ్చు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున విమనాశ్రాయం దగ్గర చేరుకునేటప్పటికి టెన్షన్ పెరిగిపోయింది. ఈ మొత్తంలో పోలీసుల పాత్రను మెచ్చుకోవాల్సిందే. వాళ్ళే గనుక చంద్రబాబును జనాలకు వదిలి పెట్టేసుంటే ఎంతటి అనర్ధం జరిగుండేదో ఊహించుకోవటం కష్టమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: