ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ మెల్ల మెల్లగా ఇది ప్రపంచవ్యాప్తంగా పాకుతోంది. మనిషి నుండి మనిషికి అంటువ్యాధిలా సోకే ఈ వైరస్ కి ఇప్పటిదాకా ముందు లేకపోవడంతో ప్రపంచ దేశాలు గజగజలాడి పోతున్నాయి.  ముఖ్యంగా యూరప్ దేశాలు చైనా దేశం నుండి ఎగుమతులు దిగుమతులు అదేవిధంగా విమాన రాకపోకలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఏ దేశానికి చెందిన ఆ దేశ ప్రభుత్వాలు తమ పౌరులను తమ దేశానికి తిరిగి రప్పించేసుకుంటున్నాయి. చైనా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. దేశం లో ఎవరెవరికి కరోనా వైరస్ సోకిందో గుర్తించడానికి లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తూనే జాగ్రత్తలు తీసుకుంటుంది.

 

ఈ క్రమంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చైనా ప్రభుత్వం రాకపోకలను ఆపేసింది. రోజు రోజుకి ఈ వ్యాధి సోకే బాధితులు ఎక్కువ అవటంతో చైనాలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటువంటి నేపథ్యంలో వ్యాధిని గుర్తించేందుకు కరుణ పేషెంట్లకు బాధితులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది చైనా. కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులకు తెలియజేసిన వెంటనే చైనా ప్రభుత్వం సదరు రోగికి కొంత డబ్బు అప్పచెప్పి వైద్య పరీక్షలు నిర్వహించడానికి రెడీ అవ్వడం జరిగింది.

 

ఇప్పటికే వుహాన్‌ పరిసర ప్రాంతాల్లోని హాన్యాంగ్‌, హౌంగ్‌గవాంగ్‌తో పాటు చాలా పట్టణాలు 500నుంచి వెయ్యి యువాన్‌లను రివార్డుగా అందిస్తున్నారు. కాగా.. ఈ జాబితాలోకి వుహాన్‌కు 150కి.మీ దూరంలో ఉన్న క్వైన్‌జియాంగ్ పట్టణం కూడా చేరింది. కరోనా లక్షణాలున్న వారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇలా వచ్చిన వ్యక్తులకు వైరస్‌ ఉన్నట్లు రుజువైతే వారికి 10వేల యువాన్లు (దాదాపు లక్ష రూపాయలు)లను ఇస్తామని ప్రకటించింది. కాగా ప్రస్తుతం వైరస్ తో చికిత్స చేయించుకుంటున్న వారికి మాత్రం ఇది వర్తించదని చైనా ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: