ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కొన్నిసార్లు మహిళల పాలిట రాక్షసిగా మారుతోంది. దీన్ని ఆయుధంగా చేసుకుని కుర్రాళ్లు అమ్మాయిలను బెదిరిస్తున్నారు. అయితే కాబోయే మొగుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ దరిద్రుడు ఆ అమ్మాయికి చుక్కలు చూపించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

 

 

ఇంతకీ ఏం జరిగిందంటే.. అవనిగడ్డ అమ్మాయికీ గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్‌ అనే అబ్బాయికీ ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ కూ పెళ్లికీ మధ్య ఉన్న సమయంలో అమ్మాయి, అబ్బాయి కాస్త క్లోజ్ గా ఉండటం మామూలే కదా. అలాగే ఈ అమ్మాయి కూడా అబ్బాయితో కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యింది. ఆ సమయంలో కొన్ని సెల్ఫీలు, పిక్ లూ తీసుకున్నారు. అయితే విజయ్ భాస్కర్ మరింత అడ్వాన్స్ అయ్యాడు. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు.. పెళ్లికి ముందే వేధింపులకు దిగాడు.

 

 

దీంతో అతని ప్రవర్తన నచ్చక అమ్మాయి తరపు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన విజయ్ భాస్కర్.. తను అమ్మాయితో చనువుగా ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడుతున్నాడు. అంతే కాకుండా అమ్మాయి పేరుతో క్రియేట్‌ చేసిన మెయిల్‌ ద్వారా ఆమె బంధువులకు, ఫ్రెండ్స్ కూ ఈ ఫోటోలు పంపడం మొదలుపెట్టాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి యువతి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.

 

 

ఈ రోజుల్లో ఇలాంటి కిలాడీలను పట్టుకోవడం పోలీసులకు ఓ లెక్కా.. అందులోనూ టెక్నాలజీ బాగా పెరిగిపోయిందిగా... మనోడిని వెంటనే పట్టుకున్నారు. అతడిపై సైబర్‌ సెక్షన్ల కింద అరెస్టు చేసి లోపలేశారు. అతడు తీసిన ఫోటోలు , అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: