ఆంధ్రాలో ఓ పట్టణంలో రియల్ ఎస్టేట్ బూమ్ అదిరిపోతోంది. సాధారణంగా హైదరాబాద్ లోని డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్థాయిలో అక్కడ రేటు పలుకుతోంది. ఇంతకీ ఈ డిమాండ్ వచ్చింది ఎక్కడో మహా నగరంలో కాదు.. ఓ చిన్న పట్టణంలో.. అదెక్కడంటారా.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో.. అవును నమ్మలేక పోతున్నారు కదూ.. కానీ ఇదే వాస్తవం..

 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో గజం ధర రూ.2.50 లక్షలు పలికి ఆల్‌ టైమ్‌ రికార్డు నెలకొల్పింది. పాలకొల్లు పట్టణ ప్రధాన రహదారి క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోని భూమికి రికార్డు స్థాయిలో ధర లభించింది. పట్టణంలో గజం రూ.32-40 వేల మధ్యలో ఉంది.

 

 

పాలకొల్లులో ఓ వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా గజానికి రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించి ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది కూడా ఓ చిన్న స్థలమో కాదు.. ఏకంగా 200 గజాలు కొన్నాడు. ఇంతకీ లొకేషన్ ఎక్కడంటే.. మహాత్మా గాంధీ రోడ్డు దారి పక్కన ఉన్న స్థలం ఈ రేటు పలికింది. అయితే గతంలోనూ ఈ పాలకొల్లులో మంచి రేటే పలికింది. గతంలో లక్షా పాతిక వేలు అధికంగా ధర పలికింది.

 

 

ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు పలకడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ వార్త కలకలం సృష్టిస్తోంది. ఓవైపు అమరావతి వంటి ప్రాంతంలో భూముల రేట్లు పడిపోతున్నాయి. మరోవైపు విశాఖలో రాజధాని కళ వచ్చి రేట్లు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈ బూమ్ రావడం విచిత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: