ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్త చిత్తుగా ఓడిపోయింది.  అప్పటికే అధికార పార్టీ అయి ఉండి కూడా టీడీపీ చేసిన పాలన ప్రజలు ఛీత్కరించారు.. అందుకే ఈ ఎన్నికల్లో ఛీ కొట్టారని వైసీపీ నేతలు అంటున్నారు.  ప్రజల వద్దకు  స్వయంగా వెళ్లి వారి కష్టాలు చూసిన ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నమ్మకాన్ని ఉంచి ఎన్నిల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల హామీకి ప్రజలు ఫిదా అయ్యారు.  రాజన్న పాలన వస్తే నిజంగా అభివృద్ది జరుగుతుందని భావించారు.  ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉంటూవస్తున్న చంద్రబాబు  సమయం దొరికినప్పుడల్లా అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాడు.  ముఖ్యంగా ఇటీవల సీఎం రాజధాని విషయంలో చెప్పిన విషయాన్ని పెద్ద బూచీగా చూపిస్తూ మూడు రాజధానులపై విమర్శలు గుప్పిస్తున్నాడు చంద్రబాబు.

 

నేడు ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా.   ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 

కానీ, అభివృద్ది వైపు ప్రజలు నడుస్తున్నారని, అభివృద్ది చేసే నాయకుడిపై నమ్మకాన్ని ఉంచారని అన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేశారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు బాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారనడానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు రాయలసీమకు వచ్చినపుడు ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది.  ఆయనపై రాళ్లు, చెప్పులు కూడా విసిరారు. ఇలాంటి సంఘటనలు జరిగినా ఆయన ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రోజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: