వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలోకి తీసుకు వచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకంగా ప్రస్తుతం మారింది. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ మరియు పెన్షన్ ఇంకా అనేక ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి మరియు ప్రజలకు వారధిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో ప్రతిపక్షాలు మరియు కొన్ని రాజకీయ పార్టీలు గ్రామ వాలంటీర్ల పని తీరుపై రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. పెన్షన్ వృద్ధులకు ఇస్తున్న సమయంలో డబ్బులు కాజేస్తున్నారు అని ఇంకా అనేక విషయాలలో గ్రామ వాలంటీర్లు అప్పజెప్పిన బాధ్యతలను పక్కనపెట్టి అనవసర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో త్వరలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్విజిలేటర్ పని అప్పజెప్పడానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడం ఇప్పుడు ఏపీ లో సంచలనం అయ్యింది. కాగా ఇది విద్యార్థుల భవిష్యత్ అయిన నేపథ్యంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటువంటి పనులు ప్రభుత్వం అప్పజెప్పడం ఏంటి అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇళ్ల దగ్గర వీరు చేస్తున్న ఆగడాలను అరి కట్టకుండా ఇప్పుడు విద్యా రంగంలో కూడా వీళ్లను ఎంటర్ చేయడం ఏ మాత్రం భావ్యం కాదని ప్రశ్నపత్రాల విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మొత్తానికే మోసం జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

అంతేకాకుండా తెలిసీ తెలియని పనులు అదికూడా విద్యావ్యవస్థలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోపక్క గ్రామ వాలంటీర్లు ఇటువంటి పనుల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారట. ఏ మాత్రం పరీక్షలలో క్రమ పద్ధతి సరిగ్గా చేయకపోయినా మొత్తానికి ఆ విద్యార్థి యొక్క జీవితం మేము నాశనం చేసిన వాళ్లమవుతాం అంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక విషయంలో గ్రామ వాలంటీర్లు కొంతమంది షాకింగ్ కామెంట్లు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: