ఇంట్లో ప్రసాదం ఉంటె బయట పులిహోరకు  చాలా మంది కక్కుర్తి పడే మగాళ్లు చాలా మంది ఉన్నారు. అలానే భార్యను  మంది బయట వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అలా చేస్తూ తమ కుటుంబాలని నడిరోడ్డున పడేస్తారు. మరి కొందరు మాత్రం ప్రేయసితో రాసలీలలు చేస్తూ  దొరుకుతూ జీవితాన్ని నవ్వుల పాలు చేస్తుంటారు. అది లేదంటే ప్రేమించిన వాళ్ళు దక్కలేదని ప్రాణాలను తీసుకుంటారు. ఇక్కడ ఓ ప్రబుద్దుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని గ్రామస్తులకు అడ్డంగా దొరికారు.. 

 

 


బట్టలను చించి నగ్నంగా అతన్ని ఊరేగిస్తూ దేహశుద్దీ చేయడమే కాకుండా అతని నగ్న వీడియోలను సెల్ ఫోన్లలో బంధించారు. వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికి అదే గ్రామంలో ఉంటున్న పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

 

 


ఈ నేపథ్యంలో మంగళవారం ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉండగా మహిళ మరిది వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతడితో కలిసిన కొంతమంది ఊరి జనం నిందితుడిని విపరీతంగా చితకబాదారు. బట్టలు పూర్తిగా చించేసి, గ్రామంలోని వీధుల గుండా నగ్నంగా తిప్పారు. అంతేకాకుండా ఊరేగింపునంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచారు.


 

అనంతరం మహిళ బంధువు ఒకరు నిందితుడికి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీడియో ఆధారంగా నిందితుడిపై దాడికి పాల్పడ్డవారిని గుర్తించిన పోలీసులు వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాంటి వాడికి అలానే జరగాలని చాలా మంది ఎత్తిపొడుస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: