కరోనా.. చైనాలో పుట్టిన ఈ కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వ్యాధి ఊహించని విదంగా అత్యంత వేగంగా వ్యాపిస్తూ వస్తుంది. ఇప్పటికే చైనాలో 500 మంది మృతి చెందినట్లు నిర్దారించారు.సుమారు 20 వేల మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మన దేశంలో ఈ కరోనా వైరస్ బాధితుల సంఖ్య ముగ్గురికి చేరిన సంగతి తెలిసిందే. 

 

 

 

తెలుగు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అటు కేంద్రం పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది.అయినా కూడా చైనాలో కరోనా వ్యాప్తి తగ్గినట్లు కనిపించలేదు. దీంతో చైనా నుండి వస్తున్నా అన్నీ నిలిపివేశారు. అయితే ప్రపంచాన్ని మొత్తం షేక్ చేసిన ఈ కరోనా ఎఫెక్ట్ జనసంద్రం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చూపిస్తుంది. ఇప్పటికే పలు దేవాలయాలను మూసివేశారు. 

 

 


ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ ను కోవిడ్ గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే... సౌదీ అరేబియాకు కూడా తాకింది. దీంతో ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మసీదు, మదీనా మసీదుల సందర్శనను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది. కోవిడ్‌ వైరస్‌ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. 

 

 


ఈ మేరకు ప్ర‌తి నెల వేల సంఖ్య‌లో ముస్లిం భ‌క్తులు ఉమ్రా ద‌ర్శ‌నం కోసం సౌదీ వ‌స్తుంటారు. వైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులకు తగిన వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే మక్కా సందర్శనకు అనుమతిస్తామని ప్రకటించారు.ఏడాది ద్వితీయార్థంలో ముస్లింల రాక ఎక్కువగా ఉండటంతో సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: