2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవం మూట గట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే జనసేన పార్టీకి చెందిన నేత  గెలవగా ఇక జనసేనాని సైతం ఓడిపోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇక 2019 ఎన్నికల వరకు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ ఎంతో జోరు మీద కనిపించిన జనసేన పార్టీ 2019 ఎన్నికల తర్వాత కొంచెం కొంచెం గా ఖాళీ అవుతూ  వచ్చిన విషయం తెలిసిందే. జనసేన పార్టీలో పదవులు ఆశించి భంగపడిన వారు.. కొంతమందైతే జనసేన పార్టీ పని అయిపోయింది అని అనుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది. ఇలా కారణమేదైనా రోజురోజుకూ జనసేన పార్టీ నుంచి నేతలు మాత్రం వీడుతూ వచ్చారు. 

 


 అది కేవలం జనసేన పార్టీని వీడటమే  కాదు బయటకు వచ్చిన తరువాత ఏకంగా జనసేన పార్టీ పైనా చెడు ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు మాజీ జనసేన నేతలు. అది కూడా ఇండైరెక్ట్ గా  పవన్ ని అనలేక పవన్ ఉద్దేశిస్తూ ఇతర వ్యక్తుల పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నేతలు. పవన్ సరిగ్గానే ఆలోచిస్తున్నారు కాని పవన్ పక్కన వాళ్ళు మాత్రం ఆయనను  మారుస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన పార్టీ నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా అది పవన్ కళ్యాణ్ మాత్రమే  తీసుకుని ఉంటారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 అయితే జనసేన పార్టీ పై జనసేన నేతల పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న మాజీ జనసైనికుల పైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ గురించి తనకు తెలుసునని.. పార్టీ నుంచి వీడిన వారు పార్టీ పైన అనవసర ఆరోపణలు చేయవద్దు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఒకసారి పార్టీ నుంచి బయటకు వెళ్ళాక జనసేన పార్టీతో  వారికి ఎలాంటి సంబంధం ఉండదు అంటూ తేల్చి చెప్పారు. మరోసారి పార్టీ పైన పార్టీ నేతలు బురద  చల్లేందుకు  ప్రయత్నిస్తే లీగల్ గా  చర్యలు తీసుకుంటామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. మరోవైపు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సక్రమంగానే పనిచేస్తున్నారని ఏకంగా నాగబాబు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: