నాకు దక్కనిది ఇతరులకు దక్క కూడదు.. అని ఒక సినిమాలో విలన్ అంటాడు.. అది డైలాగే అయినా ఇప్పుడు ఇలాంటి మ్యాటరే కాంగ్రెస్‌లో నడుస్తుంది.. అదే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విషయంలో.. నాకంటే నాకని వాదులాట జరుగుతుందని ఆ పార్టీ నాయకుల తీరును బట్టి తెలుస్తుంది.. ఇక ఎప్పటి నుండో రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి దక్కుతుందని, ఇతనే కేసీయార్‌కు  సరైన నాయకుడని ఒక వాదం ఉండగా.. ఇప్పుడు ఈ పదవి నాకు దక్కక పోయినా ఫర్వాలేదు కాని రేవంత్‌కు దక్క కూడదనే ప్రయత్నాలు కుట్రలు జోరుగా సాగుతున్నాయట..

 

 

ఇది వరకు ఇలాంటి ప్రయత్నమే సొంత పార్టీలోవారే చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఇదే ప్రయత్నాన్ని మరో అధికార పార్టీ వారు చేస్తున్నారట.. ఇక ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో చ‌క్రం తిప్పిన ఓ ప్ర‌ముఖ నేత ద్వారా అధికార పార్టీ వ్యూహం న‌డిపిస్తోంద‌ని రేవంత్ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోందట. రేవంత్ కి సంబంధించిన కొన్ని వ్య‌వ‌హారాల‌ను హైక‌మాండ్ దృష్టికి సదరు నేత ద్వారా తీసుకెళ్ల‌ి, ఆయ‌న‌కి పీసీసీ ద‌క్క‌కుండా చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని రేవంత్ వర్గం అభిప్రాయపడుతోంది.

 

 

ఇకపోతే తాజాగా, డిప్యూటీ క‌లెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డిని ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. దీని వెన‌క రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఇదే కాకుండా ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప‌ట్నం గోస యాత్ర చేస్తూ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఒక‌వేళ రేవంత్ కి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కితే.. కేసీఆర్ కు ఏకు మేకులా మారుతాడని మనసులో భయం ఉందట.. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని తెరాస‌ ఏదో ఒక ఇష్యూలోకి రేవంత్ ని లాగాల‌ని, త‌ద్వారా పీసీసీ ప‌ద‌వి ద‌క్క‌నీయ‌కుండా చేసే వ్యూహం అమ‌లు జ‌రుగుతోందంటూ రేవంత్ మ‌ద్ద‌తుదారులు అనుకుంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: