టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ అక్రమాలను బయట పెడతానంటూ ప్రజా చైతన్య యాత్ర చేపట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత కాస్త సమయం తీసుకుని చిత్తూరు జిల్లాలో పర్యటించారూ  ఇక నేడు విశాఖ జిల్లాలో పర్యటించేందుకు నిర్ణయించారు చంద్రబాబు నాయుడు. ఇక విశాఖలో పర్యటనలో భాగంగా నేడు విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు వైసిపి కార్యకర్తలు అందరూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పాలి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే గో బ్యాక్  చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ భారీ మొత్తంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదే క్రమంలో టిడిపినేతలు  కూడా అక్కడికి చేరుకొని చంద్రబాబు కు మద్దతుగా నిలిచారు. 

 


 ఈ క్రమంలోనే కాన్వాయ్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్డు పై టీడీపీ  నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఇది కొన్ని గంటలపాటు జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చంద్రబాబును మళ్ళీ తిరిగి పంపించేశారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం మండిపడుతున్నారు. విశాఖలో పర్యటించేందుకు ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకున్న చంద్రబాబును  పోలీసులు ఎందుకు తిరిగి పంపించటం ఏంటని  రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏదైనా చేస్తున్నప్పుడు టిడిపి సభ్యులందరినీ హౌస్ అరెస్ట్ చేసినట్లు గానే... వైసిపి కార్యకర్తలు నేతలు చంద్రబాబు పర్యటనకు ఇబ్బందులు కలిగిస్తారని వారిని కూడా ముందుగా అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 ఒకప్పుడు జగన్ ను తిరిగి పంపించేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబును తిప్పి పంపించేశాం  అంటే అది ప్రజాస్వామ్యం కాదని... ఒకప్పుడు ప్రతిపక్ష నాయకున్ని  పోరాటం చేయనివ్వరా అని న్యాయం గురించి మాట్లాడిన అదే పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తిప్పి పంపడం దారుణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోలీసులు అనుమతి ఇచ్చి దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేయడం తప్పు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: