వ‌య‌సులతో సంబంధం లేకుండా...ఆరోగ్యం గురించి ఆలోచ‌నే లేకుండా మందును తాగేస్తున్న వారి సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. రోడ్డ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు జనవరి నుంచి ఫిబ్రవరి 24వ తేదీవరకు చేపట్టిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దాదాపు 4,145 మంది మందుబాబులపై కేసులను నమోదు చేసి వారు నడిపిన వాహనాలు, కార్లు, ఆటోలు, డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ వివ‌రాల‌ను విశ్లేషించిన పోలీసుల‌కు ఆశ్చ‌ర్య‌క‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

 


అతిగా మద్యం సేవించి రోడ్లపై వాహనాలను నడిపిస్తున్న వారికి  డ్రంకన్‌డ్రైవ్ నిర్వ‌హించ‌గా...అందులో పట్టుబడిన మందుబాబుల కౌంట్‌ చూస్తే పోలీసులకే బీపీ పెరిగిపోతుంది. 100 మిల్లి లీటర్ల రక్తంలో 35గ్రాముల మద్యం ఉండాల్సిన మోతాదు కొంత మంది మందుబాబుల్లో బ్లడ్‌ అల్కాహాల్‌ కాన్‌సెంట్రేషన్‌ 550కి చేరుకుంటుంది. అంటే అసలు వారు సోయిలేకుండానే రోడ్లపై వాహనాలతో దూసుకుపోతున్నార‌న్న‌ట‌మాట‌. ఇలా భారీకౌంట్‌తో పట్టుబడ్డ వారిలో అల్వా ల్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శంషాబాద్‌ పరిధిలో అత్యధికంగా ఉన్నారని తేలింది. 

 


ఇంత భారీగా తాగిన వారిలో చాలామంది యువత ఉన్నార‌ట‌. వీరు మద్యం మత్తులో హెల్మెట్‌ పెట్టుకోకుండా, కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలను అతి వేగంతో నడిపిస్తూ రహదారులపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అతిగా మద్యం సేవించీ ఇక వీరు రోడ్లపై వాహనాలను నడిపించేందుకు అర్హులు కారని తేల్చి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దాదాపు 790 మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేశారు.  డ్రంకన్‌ డ్రైవ్‌, అతివేగంతో చేసే డ్రైవింగ్‌ వల్ల కలిగే అనర్థాల‌పై ట్రాఫిక్‌ పోలీసులు వివిధ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్‌పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా రు. ముఖ్యంగా వాహనాలను ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వారికి నిబంధనలను పాటించమని చెప్పాలని కోరుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే వాహనాలు ఇవ్వొద్దన్నారు. మైనర్లుకు అసలు ఇవ్వొద్దని, వారు దొరికితే యజమానికి జైలు తప్పదని పోలీసులు స్ప ష్టం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: