తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనుండగా, మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ తెలిపింది. కాగా, ఫిబ్రవరి 1నుంచి 20వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 28, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

 

అయితే ఇలాంటి దశలో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది. ఇరుకు భవనాల్లో కాలేజీలు నిర్వహిస్తూ.. విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు చెలగాటమాడుతున్నాయని, అనుమతుల్లేని కాలేజీలను మూసి వేసేందుకు అనుమతించాలని కోర్టుకు నివేదించింది.

 

కానీ ఇప్పుడు మరొక వారంలో పరీక్షలు పెట్టుకొని ఇలా అర్థాంతరంగా కాలేజీలు మూసివేస్తే సుమారు 29 వేల 808 మంది విద్యార్థులు పరీక్షాలకు ముందు ఇబ్బంది పడతారని ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల మూసివేతకు అనుమతించాలని ఇంటర్ బోర్డు తెలంగాణ హైకోర్టును కోరింది.

 

సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హై కోర్టుతగిన చర్యలు తీసుకొని ఏప్రిల్ 3 తేదీన నివేదిక సమర్పించాలని తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇలా ఇన్ని గుర్తింపు లేని కలాశాలు ఇన్ని రోజులు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించగా…. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చామని హై కోర్టుకి తెలిపారు. ఏదేమైనా నిర్లక్ష్యంగా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బే లక్ష్యంగా నడుస్తున్న ప్రైవేటు కాళాశాలలన్నింటికీ ఇది చావు దెబ్బ అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: