కరోనా ఇప్పుడు కాసుల పంటకూడ పండిస్తుంది.. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచదేశాలను ఫ్రీగా చుట్టేస్తుందన్న విషయం తెలిసిందే.. ఈ వ్యాధిబారిన పడిన వారికి డైరెక్టుగా ఏ రికమండేషన్ లేకుండా  యమపురికి వెళ్లడానికి దారులు ఎప్పుడు తెరుచుకునే ఉన్నాయి.. ఇక ఇప్పటికే ఈ వైరస్‌ను వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామని చైనా వెల్లడిస్తుండగా.. ఇందులో ఎంతవరకు నిజం దాగి ఉందన్న విషయం మాత్రం తెలియడం లేదు..

 

 

ఇక ఈ వ్యాధి బాధితులను అరికట్టడానికి చైనా ఒక ఫ్లాన్ వేసింది..అదేమంటే.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోడానికి ముందుకొచ్చేలా అక్కడి ప్రభుత్వం రివార్డును ప్రకటించింది. వేల మందికి సోకిన ఈ వైరస్‌ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ వ్యాధి ఉన్నవారిని వీలైనంత తొందరగా గుర్తించి వైద్య పరీక్షలు చేయాలని భావించిన చైనా.. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు.

 

 

అంతేకాదు వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అధికారులకు తెలియజేసినా కూడా నగదు అందజేసి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే వుహాన్‌ పరిసర ప్రాంతాల్లోని హాన్యాంగ్‌, హౌంగ్‌గవాంగ్‌తో పాటు చాలా పట్టణాల వారికి 500నుంచి వెయ్యి యువాన్‌లను అందజేస్తున్నారు. ఈ జాబితాలోకి వుహాన్‌కు 150కి.మీ దూరంలో ఉన్న క్వైన్‌జియాంగ్ పట్టణం కూడా చేరింది. కరోనా లక్షణాలు ఉన్నవారి గురించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇలా వచ్చిన వ్యక్తులకు వైరస్‌ ఉన్నట్లు రుజువైతే వారికి 10వేల యువాన్లు (మన కరెన్సీలో దాదాపు లక్ష రూపాయలు)లను ఇస్తామని వెల్లడించింది...

 

 

అయితే, ఇప్పటికే చికిత్స చేయించుకుంటున్నవారికి మాత్రం ఇది వర్తించదని స్పష్టంచేసింది. అంతేకాదు, వైరస్‌ అనుమానిత వ్యక్తికి కూడా దాదాపు 2వేల యువాన్‌లు ఇస్తామని వెల్లడించింది... చూసారుగా చైనా బహుమతి ప్రకటన.. కరోనాను ప్రపంచం అంతా పాకించి ఇప్పుడు ఏం తెలియనట్లుగా బహుమతులు ప్రకటిస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: