ఆధిపత్య పోరు ఎంత వారినైనా కిందకు దించుతుంది.. వారి సీటుకు ఎసరు పెడుతుందన్న విషయం తెలిసిందే.. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్దితులు చాలా ఘాటుగా, వేడి వేడిగా మరిగిపోతున్నాయట.. ముఖ్యంగా వైసీపీలో ఇది మరి ఎక్కువగా ఉందట.. ఏపీలో ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారట. ఎవరి మాట వినకుండా గ్రూపులు కట్టి.. మరీ రచ్చకెక్కుతున్నారట. ఇక్కడ ఎవరి స్దాయితో సంబంధం లేకుండా జూనియర్ల నుంచి సీనియర్ల వరకూ అందరూ ఇదే తీరుగా పోటీ పడుతున్నారట.

 

 

ఇకపోతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతున్న సమయంలో, సీఎం జగన్ రానున్న కాలంలో కూడా తమ పార్టీ పునాదులు గట్టిగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలను సైతం అన్ని కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. ఒకపక్క, అధినేత పాలనలో బిజీగా ఉంటే, మరోపక్క అనేక ప్రాంతాలలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరితో ఒకరు సఖ్యతగా ముందుకు వెళ్లాలని అధినేత చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్నారట. దీంతో వైసీపీ ముఖ్య నేతల మధ్య విభేదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయట..

 

 

ఇక గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేశ్‌ మధ్య పోరు సీఎం వరకు వెళ్లింది. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, విడదల రజిని మధ్య విభేదాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు విషయంలోనూ వర్గపోరు కనిపించింది. ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఆయన పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకి మధ్య ప్రతి చిన్న విషయంలో పంతాలు పెరిగిపోతున్నాయని వైసీపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

 

 

ఇలా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ప్రజాప్రతినిధుల మధ్యనే కాకుండా.. జిల్లా ఇన్‌చార్జులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు, మధ్య విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొందరు కొత్తవారు కావడంతో నియోజవర్గంలో తమ హవానే నడవాలని, లేకపోతే ప్రజలలో చులకన అయిపోతామేమో అనే భావనతో ఇలా ప్రవర్తిస్తున్నారట.. అయితే ఈ సమస్యలన్నింటీకి అధినేత జగన్‌ ఒక రోజు సమాధానం ఇస్తారని, అప్పుడు ఎవరి పని వాళ్లు చేసుకుంటారని కొందరు నేతలు అంటున్నారు.

 

 

కానీ ఈ పరిస్దితిని తొందరగా అరికట్టకపోతే రానున్న రోజుల్లో పార్టీకి గడ్దురోజులు ఎదురవుతాయని కొందరు చర్చించు కుంటున్నారట.. ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆ పార్టీ నేతల్లో కొందరు భావిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: