దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన దాడుల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం ఉదయం అతని మృతదేహం చాంద్‌బాగ్ బ్రిడ్జి సమీపంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ ఇంటి వెనకాల ఉన్న ఒక మురికి కాలవలో లభించింది. అంకిత్ శర్మ పాడే గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి అంకిత్ శర్మ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. అయితే తాజాగా పోస్టుమార్టం నివేదిక వివరాలు బయటికి వచ్చి అంకిత శర్మ ఎంత ఘోరంగా చంపబడ్డాడో తెలియజేస్తుంది.



పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం... ఎవరి ఊహలకి అందలేని విధంగా అంకిత్ శర్మ ని బ్రతికుండగానే 400 సార్లు పదునైన అంచులు గల వస్తువులతో(కత్తులతో) పొడిచి నట్టు తెలిసింది. తన శరీరం మొత్తం అనగా అతని బొటనవేలు నుండి నడినెత్తి వరకు ఎక్కడ చూసినా కత్తి పోట్లే కనిపించాయి. అతడిని దాదాపు నాలుగు నుండి ఆరు గంటల వరకు ఆరుగురు కలసి కత్తులతో పొడిచినట్టు ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. అతని కడుపులోని ప్రేగులను కిరాతకంగా చీల్చినట్లు శవ పరీక్షలో తేలింది. ఫోరెన్సిక్ వైద్యులు మాట్లాడుతూ... తమ జీవితంలో అంకిత్ శర్మ లాంటి భయం కల్పించే హత్యను ఎన్నడూ చూడలేదని, తాము శవ పరీక్ష నిర్వహించే టప్పుడు సొమ్మసిల్లేనంత పనైందని చెప్పారు.



పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందం నివేదికను కంఫర్మ్ చేస్తూ అంకిత్ శర్మని దారుణంగా నాలుగు వందల సార్లు పొడవడం వల్లనే చనిపోయాడు అని చెప్పారు. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ ఇంటెలిజెన్స్ బ్యూరో లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అంకిత్ శర్మ 2017 లో ఐబి లోని శాంతిభద్రతల విభాగం లో జాయిన్ అయ్యాడు.



ఇకపోతే మృతుడి తండ్రి రవీందర్ వర్మ తన కొడుకు మరణం వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉందని చెబుతున్నారు. అంకిత్ శర్మ హత్య జరుగుతున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ తాహీర్ హుస్సేన్ అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. కొంత మంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ... ఒక ముస్లిం మూక ఇద్దరితో కలిసి అంకిత్ శర్మ ని తాహిర్ హుస్సేన్ ఇంటిలోపలికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అలాగే, తాహీర్ హుస్సేన్ ఒక కర్ర పట్టుకొని దాడి చేస్తున్న ఫోటోలు వీడియో క్లిప్లు బయటికి వచ్చాయి. తాహిర్ హుస్సేన్ డాబా(టెర్రస్) మీద రాళ్లు, పెట్రోల్ బాంబులు(molotov cocktails) ఉన్నట్టు కొన్ని చిత్రాలు కూడా నెట్టింట దర్శనం అయ్యాయి. వందల మంది ఇస్లాం మతస్థులు తాహిర్ ఇంటి డాబాపై ఎక్కి అక్కడి నుండి ప్రజల పైన రాళ్లు రువ్వి, పెట్రోల్ బాంబులు వేశారని తెలుస్తుంది. ప్రస్తుతం అంకిత్ తండ్రి ఫిర్యాదు మేరకు తాహిర్ పై ఐపీసీ సెక్షన్ 302(a) మర్డర్ కేస్ నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: