చంద్రబాబు రాజకీయం చూస్తే అవసరం అయిన విషయాలతో పాటు అనవసర రాజకీయాలు చేయడంలో దిట్ట అంటారు. అందుకు ఉదాహరణ వైఎస్ జగన్ విషయంలో  అప్పట్లో జోక్యం చేసుకుని కాంగ్రెస్ తో కలసి మరీ కేసులు పెట్టించి జైలు వరకూ కధ నడిపించారు. దాని వల్ల జగన్ వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది పడ్డా రాజకీయంగా మాత్రం రాటుదేలారు. పదేళ్ళ జగన్ రాజకీయానికి అలా బలమైన పునాది నాడు పడింది.

 

ఇక చంద్రబాబును తీసుకుంటే జగన్ని తనకు పోటీగా భావించి ప్రతీ సందర్భంలో అడ్డుకుంటూ గోటితోపోయే ప్రతీ వ్యవహారాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ సీఎం అయ్యాక తొమ్మిది నెలల కాలంలో ఓ వైపు సంక్షేమం పెద్ద ఎత్తున ఏపీలో చేస్తూ కూడా బాబు మీద ఒక కన్నేసి ఉంచారు. 

 

బాబు గత అయిదేళ్ళ పాలనలో అవినీతిని వెలికితీస్తున్నారు. ఇందుకోసం పలు కమిటీలు వెసిన జగన్ తాజాగా సిట్ ని నియమించడంతో బాబుకు ఇబ్బంది తప్పదని అంతా భావిస్తున్నారు. దానికి ముందు ట్రయల్  అన్నట్లుగా విశాఖ ఎపిసోడ్ నడిచిందని
అంటున్నారు.

 

విశాఖలో బాబుని అరెస్ట్ చేసి  వెనక్కి తిప్పి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించిన విశాఖ పోలీసులు నాటి జగన్ బాకీని అలా తీర్చుకున్నారు. ఇపుడు మిగిలి ఉంది అసలు బాకీ. అదే పెద్ద  బాకీ. జగన్ని అకారణంగా పదహారు నెలల పాటు జైలు గోడల వెనక్కు నెట్టిన పాపానికి బాబు మూల్యం చెల్లించుకుంటారని కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తున్న మాట.

 

అంటే బాబుపై జరుగుతున్న విచారణలు ఒక రోజున‌ లాజికల్ కంక్లూషన్ కి వస్తాయని నాడు బాబు జైలు వూచలు లెక్కబెట్టకతప్పదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ నెమ్మదిగా వేస్తున్న ఒక్కో అడుగును బట్టి చూస్తూంటే అది నిజం అవుతుందని అనిపిస్తోంది. చిన్న బాకీతో బాబుకు పెద్ద ఝలక్ ఇచ్చిన జగన్ పెద్ద బాకీని కూడా తీర్చేసి ఆయనకు కోలుకోలేని షాక్ ఇస్తారని అంటున్నారు. 


కాగా విశాఖలో ఎయిర్ పోర్టులో జరిగిన పరిణామాలను తలచుకుంటున్న తమ్ముళ్ళు రాబోయే రోజులను వూహించుకుని మధనపడుతూంటే వైసీపీలో మాత్రం ఆ రోజు వచ్చి తీరుతుందన్న నమ్మకం బలపడుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: