అమెరికా ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  గత కొంతకాలంగా గల్ఫ్ లో ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందేమో అనుకున్నారు.  దీంతో గల్ఫ్ లో ఉదృక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఇరాన్ సుప్రీం కమాండర్ సులేమానిని అమెరికా హతమార్చిన తరువాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ఇరాన్ సైన్యం రాకెట్లతో ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది.  


అయితే, దీని తరువాత రెండు దేశాలు యుద్ధంలో పాల్గొంటాయేమో అనుకున్నారు.  అలాంటిది జరగకుండానే సైలెంట్ కావడం విశేషం.  అయితే, ఇప్పుడు ఇరాన్ ఓ విషయంలో తెగ ఇబ్బందులు పడుతున్నది. అది మరెంతో కాదు... వైరస్.  కరోనా వైరస్.  చైనా తరువాత ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇరాన్ లోనే సంభవించాయి.  ఇరాన్ ఏడాది దేశం.  వేడి ఎక్కువగా ఉంటుంది.  ఇరాన్ కు ఎలా వ్యాపించిందో తెలియడం లేదు.  


చైనాలో ఈ వైరస్ కారణంగా దాదాపుగా  2800 మందికి పైగా మరణించగా, ఇరాన్ లో 30 మంది వరకు మరణించారు.  250 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  అయితే, ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఏమంటే, ఇరాన్ లో ఎందుకు ఈ వైరస్ వ్యాపించింది.  ఎలా వ్యాపించింది.  దాని వెనుక గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇరాన్ లో ఈ వైరస్ వ్యాపించడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాలు తెలియడం లేదుగాని, కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు.  


ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నది.  వైరస్ వలన కలుగుతున్న ఇబ్బందులను ప్రపంచం దృష్టిలో పెట్టుకొని విరుగుడు ముందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇరాన్ ఆరోగ్యశాఖ ఉప మంత్రికి ఈ వైరస్ సోకిన సంగతి తెలిసిందే.  వైరస్ ఆరోగ్య మంత్రికే కాకుండా, ఇప్పుడు ఆ దేశ ఉపాధ్యక్షురాలుకి కూడా వైరస్ సోకినట్టు  అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.  ఇరాన్ లో ఈ వైరస్ వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పుడు ఈ వైరస్ అటునుంచి పాక్, ఇండియా కు వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: