స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి మన ప్రభుత్వాలు మహిళలకు ఎంతో చేస్తున్నాయి. వారికోసం వివిధ రంగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్నాయి. లేడీస్ ఫస్ట్ అన్న కాన్సెప్టుని  అమలు చేస్తున్న వారంతా వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న వైనమూ చూస్తున్నదే. మహిళలు అకాశాంలో సగం, అవకాశాల్లో సగం కావాలని ఓ వైపు డిమాండ్ చేస్తున్నారు. దానికి తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు, ఏలికలూ ఇంకో వైపు కనిపిస్తున్నారు.

 

 మహిళలకు విద్యా, ఉద్యోగాలు, భద్రతకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, మహిళల కోర్టులను మనం ఇంతవరకూ చూశాం. చిత్రమేంటంటే మహిళల కోసం అంటూ ప్రత్యేకంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న అద్భుత ఆలోచన కూడా ఈ దేశంలోని పాలకులకే కలగడం విశేషమే కాదు, విడ్డూరం కూడా.

 

ఇది ఎక్కడ అనుకుంటున్నారా. మధ్యప్రదేశ్ లో రెండేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ కీలకమైన సంచలమైన నిర్ణయం తీసుకుంది.  ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా  మధ్యం కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఈ డెసిషన్ తీసుకున్నారుట.  భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్ లలో ప్రత్యేకంగా  మహిళల కోసం ప్రత్యేక మద్యం దుకాణాలను తెరవనున్నట్లుగా తాజాగా అక్కడి సర్కార్ ప్రకటించింది.

 


ఈ మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం కూడా లభిస్తుందని  ప్రభుత్వం తెలిపింది. ఆదాయం కోసం మద్యం పాలసీని కొత్తగా మార్పులు చేస్తామని ప్రకటించిన మధ్యప్రదేశ్ సర్కార్ ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకుంటుందని బహుశా ఆ పార్టీలో వారే వూహించలేదుట. మరి దీని మీద విపక్షాలు ఎలా స్పందిస్తాయో. లేడీస్ మ్యాటర్ కనుక వారు కూడా ఓకే అంటే రేపో మాపో దేశమంతా మహిళా మద్యం దుకాణాలు తోరణం కడతాయేమో చూడాలి.

 

ఓ వైపు ఏపీలాంటి రాష్ట్రాలు మద్యాన్ని వద్దని నిషేధం దశల వారీగా అమలు చేయలని చూస్తూంటే దేశంలో కొన్ని రాష్ట్రాలు కొత్త పూనకంతో ఊగడం దేశంలో మద్యం మహమ్మారికి స్వాగతం పలకడమేనని సామాజికవేత్తలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: