పూర్వం మహమ్మారి వచ్చి ఊర్లకు ఊర్లు తుడుచుకుపెట్టుకుపోయాయి అని చెప్పుకునేవారు.  దాని అర్ధం ఏంటో తెలుసా? ఊర్లకు ఊర్లు తుడుచుకుపెట్టుకుపోవడం అంటే మరణించడం అని అర్ధం.  మహమ్మారి వలన ఒకప్పుడు అలా జరిగేది.  కానీ, ఇప్పుడు వైద్య శాస్త్రం అందుబాటులోకి వచ్చింది.  వైద్యశాస్త్రం అందుబాటులోకి రావడం వలన అన్ని రకాలుగా వైద్యం అందుతున్నది.  క్యాన్సర్ వంటి వాటికే చికిత్సలు అందుతున్నాయి.  


ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయపడిపోయేవారు.  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  అన్ని విధాలుగా కూడా క్యాన్సర్ నుంచి బయటపడుతున్నారు.  అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య ప్రపంచాన్ని భయపెడుతున్నది.  అదే కరోనా.  కరోనా వైరస్ వలన ఇప్పటికే ప్రపంచంలో 2800 మంది మరణించారు.  ఒక్క చైనాలోనే  2700 మందికి పైగా మరణించడం విశేషం.  చైనా తరువాత స్థానంలో ఇరాన్ ఉండగా, ఆ తరువాత కొరియా ఇటలీ దేశాలు ఉన్నాయి.  


కొరియా అంటే చైనాకు పక్కనే ఉన్నది.  రెండు దేశాల మధ్య అన్నిరకాల సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వైరస్ సోకింది అంటే ఒకే అనుకోవచ్చు.  ఇరాన్ కు ఎలా వచ్చిందో తెలియడం లేదు.  ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశం.  గల్ఫ్ దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.  ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే దేశాల్లో వైరస్ బ్రతకలేదు.  కానీ, ఇరాన్ లో మరణాలు అధికంగా ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.  


ప్రపంచానికి కరోనా సవాల్ విసురుతున్నది.  ఒకవేళ ఈ వైరస్ వేడి వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడి విజృంభించడం మొదలుపెడితే ఇక ప్రపంచం వినాశనం కావాల్సిందే తప్పించి బయటపడలేదు.  ప్రపంచం ఈ వైరస్ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం.  వీలైనంత త్వరగా ఈ వైరస్ కు విరుగుడు కనుగొనడమే.  విరుగుడు కనుగొంటేనే అన్ని సమస్యల నుంచి బయటపడతారు.  లేదంటే ఇబ్బందులు తప్పవు.  49 దేశాల్లో దీని ప్రభావం ఉన్నది అర్ధం  చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: