విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర చంద్రబాబునాయుడు విషయంలో  గురువారం జరిగిన హై ఓల్టేజ్ డ్రామాపై బిజెపి నేతలు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. రగడ జరిగింది ప్రభుత్వం, తెలుగుదేశంపార్టీ మధ్య. కానీ ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేని బిజెపి నేతలు ఫుల్లుగా హ్యాపీగా ఎందుకున్నారు ? ఎందుకంటే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్రమోడి, అమిత్ షా విషయంలో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.

 

ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి హోదాల్లో ఏపికి వచ్చిన వాళ్ళ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఇపుడు లెక్క సరిపోయిందని కమలం నేతలు సంబర పడుతున్నారు. ఎన్డీఏలో ఉన్నంత కాలం రాష్ట్రప్రయోజనాల గురించి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో ఆ  తర్వాత మోడి, అమిత్ షాల పర్యటనల్లో టిడిపి నేతలు, కార్యకర్తలను చంద్రబాబు ఎగేశారు.

 

మోడి, అమిత్ షా పర్యటనల్లో నిరసన వ్యక్తం చేయించారు. నల్ల జెండాలు, బ్యానర్లతో వ్యతిరేక నినాదాలు చేయించారు. అమిత్ షా కాన్వాయ్ మీద చెప్పులు, రాళ్ళతో దాడులు చేయించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద చెప్పులతో దాడులు చేయించారు. ఇలా ఏవేవి చేయకూడదో అవన్నీ బిజెపి అగ్రనేతల విషయంలో చంద్రబాబు చేయించారు. అదేమంటే మోడి, అమిత్ షా ల విషయంలో జనాగ్రహం అంటూ సమర్ధించుకున్నారు.

 

ఇపుడు చంద్రబాబు విషయంలో కనబడింది కూడా జనాగ్రహమే అంటూ బిజెపి నేతలు టిడిపి నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగి జగన్ పై వ్యతిరేకంగా  జనాలను రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం చంద్రబాబు విశాఖ వచ్చినపుడు వైసిపి కార్యకర్తలు, జనాలు కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయమై బిజెపి నేతలు మాట్లాడుతూ తమకు చంద్రబాబు చేసిన విషయంలో ఇపుడు జరిగినదానికి లెక్క సరిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: