ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు.  కొన్ని సార్లు ప్రకృతి బీభత్సానికి ప్రమాదాలు జరుగుతుంటే.. కొన్నిసార్లు నర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజూ పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. వందల సంఖ్యలో గాయాలతో వికలాంగులుగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది.  తాజాగా హైదారాబాద్ లో ఘోరం జరిగింది. హాయిగా నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై గోడ రూపంలో మృత్యువు కబలించింది.  పసిపిల్లల కేరింతలతో కళకళలాడిన ఆ ఇల్లు అంతలోనే తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తుకాగితాలు ఏరుకుని జీవించే మిఠాలాల్, గబ్బర్ లనే అన్నదమ్ములు ఈ ఇంట్లోనే తమ రెండు కుటుంబాలతో కలిసి నివాసముంటున్నారు.

 

రాత్రి పిల్లలకు అన్నం పెట్టి వారిని నిద్రపుచ్చి వారి తల్లిదండ్రులు ఇంటి ముందు కూర్చొన్నారు.  అయితే మిఠాల్ ఇంటి నుంచి పెద్దగా ఓ శబ్దం రావడంతో పరుగుపరుగున ఇంట్లోకి వెళ్లి చూడగా వంటింటి గోడ శిథిలాల కింద నలుగురు బాలికలు చిక్కుకుని ఉన్నారు. దాంతో గుండెలు పగిలినంతపనైంది తల్లిదండ్రులకు. మిఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావనిల తలలు పగిలిపోయి ప్రాణాలు విడిచారు. కాగా, గీత అనే మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.  అయితే వంటింటి గోడకు పగుళ్లు వచ్చాయని.. త్వరలో బాగు చేయించాలనే యోచనలో ఉండగానే ఇంత అనార్థం జరిగిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ చిన్నారు తల్లిదండ్రులు.

 

గోడ కూలిన ప్రమాదంలో ముగ్గురు పసిపిల్లలు విగతజీవులుగా మారడంతో అక్కడున్న వారి రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు తమ కళ్ల ముందు ఆడుకుంటూ ఆనందంగా గడిపిన చిన్నారు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోవడంతో చుట్టు పక్కల వారు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు.  ప్రాణాలు విడిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రోష్ని, సారిక, పావనిల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారి మూడేళ్ల గీతను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: