కరోనా ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఇది. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్‌ తీవ్రమైతే ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదముంది. ఈ విషయాన్ని ఏకంగా ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ అనలిటిక్స్‌ చెప్పింది. కొద్ది రోజుల వ్యవధిలోనే అనేక దేశాల్లో ఊహించని రీతిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

 

 

ఇక ఇప్పుడు కరోనా ప్రభావం దేవుళ్లనూ వదలడం లేదు.. తాజాగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర మక్కా యాత్రపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి మక్కా యాత్రకు అనుమతులను నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇలా ఎందుకు ప్రకటించాల్సించి వచ్చిందో అందుకు తగిన కారణం కూడా ఉంది.

 

 

గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. మక్కాకు వచ్చే యాత్రికులకు కొత్తగా వీసా జారీని నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ వీసాల జారీ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 

 

ఏ దేశాల నుంచి వచ్చే వారిని అనుమతించరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి కేవలం కరోనా వైరస్‌ వ్యాపించిన దేశాల నుంచి వచ్చే వారిని మాత్రం అనుమతించమని తెలిపింది. సో.. పవిత్ర మక్కా యాత్రపైనా కరోనా ప్రభావం పడిందన్నమాట. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి మక్కాలోకి అనుమతి లేనట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: