చైనా వైరస్ ప్రపంచంలో ఎక్కువగా బాధిస్తున్నది చైనా దేశాన్నే ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ వైరస్ పుట్టిందే చైనాలో.. కానీ ఇప్పుడు చైనా కంటే ఎక్కువగా కరోనా గురించి భయపడుతున్న దేశం మరొకటి ఉంది. అదే.. దక్షిణ కొరియా. చైనా తరువాత కరోనా వైరస్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఇప్పుడు దక్షిణ కొరియా ఒకటిగా మారింది.

 

 

ఒక్క బుధవారమేఈ దేశంలో కొత్తగా 334 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ దక్షిణ కొరియాలో కరోనా కేసుల సంఖ్య1600చేరుకుంది. చైనాతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తుండొచ్చు. కానీ ఇప్పుడు దక్షిణ కొరియా చైనా కంటే ఎక్కువ ప్రమాదంలో ఉంది. ఎందుకంటే.. చైనాలో కరోనాతో పోరాడేందుకు అన్నివిధాలా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

 

 

అక్కడి ప్రభుత్వం ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనాతో పోరాడేంత వైద్య సదుపాయాలు, రాజకీయ నాయకత్వం, అంగ బలం, అర్థబలం చైనాకు పుష్కలంగా ఉన్నాయి. కానీ దక్షిణ కొరియా సంగతి అలా కాదు.. అందుకే ఈ దేశంలో కరోనా మరింత వేగంగా ప్రబలే అవకాశం ఉంది. కరోనా ఒక్కసారి ప్రబలిందంటే.. అది వేల సంఖ్యలో ప్రజలను తుడిచిపెడుతుంది. అందుకే ఇప్పుడు దక్షిణ కొరియా వణికిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

 

అందుకే దక్షిణ కొరియా తీవ్రంగా అప్రమత్తమైంది. బలహీనమైన వైద్య సదుపాయాలు కలిగిన ఉత్తర కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడం ఆ దేశ ప్రభుత్వానికి సవాలుగా మారింది. వైరస్‌ను అదుపు చేసేందుకు పాఠశాలలకు సెలవులు పొడిగించింది. విదేశీయులను ఎవరినీ దేశంలోనికి అనుమతించడం లేదు. అంతర్జాతీయ రైళ్లు విమానాలను నిలిపివేసింది. వైరస్ అనుమానం ఉన్న విదేశీయులను నిర్బంధంలో ఉంచింది. ఇలా ఎన్నో చర్యలు చేపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: