ఒకవైపు జరిగే ప్రమాదాలు జరుగుతున్నాయి.. మరో వైపు ప్రాణాలంటే భయం లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు.. ఎవరి నిర్లక్ష్యానికి వారే బాధ్యులు అవుతున్నారు.. ఇప్పటికే రోడ్ల ప్రమాదాలు, ఊహించని రీతిగా జరిగి జనాభాను తగ్గిస్తుండగా, ఈ నిర్లక్ష్యం అనేది ప్రతివారికి వ్యసనంగా మారి తోటి వారికి కూడా ఇబ్బందులతో పాటుగా నష్టాలను కూడా కలిగిస్తుంది..

 

 

ఇకపోతే ఏదైనా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ప్రయాణం కోసం ఆటోలను, డీసీయం వ్యాన్లను ఉపయోగించడం ఊర్లల్లో అలవాటే.. ఈ అలవాటు వల్ల కూడ ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్న వారున్నారు.. ఇదంత ఒకెత్తైతే జేసీబీ అంటే అందరికి తెలిసిందే..

 

 

దీన్ని ఈ మధ్యకాలంలో ఎంతలా ఊపయోగిస్తున్నారంటే, దాదాపు ప్రతి పనిలో ఇది లేకుంటే ఆ పని జరగడం లేదు.. అంతే కాదు ఇటీవల కాలంలో ఈ ‘జేసీబీ’ పేరు ఎలా వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. జేసీబీతో ఎక్కడైనా తవ్వకాలు జరిగితే.. జనాలు అక్కడ కాకుల్లా వాలిపోతారని, దానికున్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదంటూ గతంలో మీమ్స్, ట్రోల్స్ వైరలయిన సంగతి తెలిసిందే.

 

 

ఇదే కాకుండా గుప్తనిధుల కోసం కూడా ఈ జేసీబి ఊపయోగిస్తున్నారు... ఇకపోతే తాజాగా మహిళలను డీసీయం నుండి కిందకు దించడానికి   మల్టీ పర్పస్ జేసీబీని ఉపయోగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మరోసారి జేసీబీ పై ట్రోలింగ్స్ మొదలయ్యింది.. ఇంతవరకు బాగానే ఉంది కానీ అనుకోని విధంగా ఏదైన ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరనే ప్రశ్నను విసురుతున్నారు కొందరు నెటిజన్స్..

 

 

అలా అందరు జేసీబీ ఎక్కినప్పుడు ఊహించని విధంగా అది స్లిప్పై క్రిందపడిపోతే, ఆనందంగా ఉన్న వారి ఇంట విషాదం పలుకరిస్తుందన్న ధ్యాస కూడా ఎందుకు ఉండటం లేదో ఈ జనానికి.. ఏదైనా జరుగకూడనిది జరిగాక లబోదిబో మంటూ గోల చేస్తారు.. మరి ఇలాంటి పనికి మాలిన పనులు చేసేటప్పుడు ఒక్కరు కూడ ఆలోచించరంటున్నారు కొందరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: