అందరిలోను  ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గురువారం విమానాశ్రయం దగ్గర చంద్రబాబునాయుడు విషయంలో జరిగిన రగడపై టిడిపి ఈరోజు హై కోర్టులో కేసు వేసింది.  తన పర్యటన విషయంలో  ముందుగా పోలీసుల నుండి అనుమతులు తీసుకున్నా కూడా చివరకు తనను పోలీసులు అడ్డుకోవటంపై చంద్రబాబు కోర్టుకెక్కారు. ఉత్తరాంధ్రలో  తనను పర్యటించే విషయంలో అనుమతులు ఇవ్వాలంటూ కోర్టును చంద్రబాబు కోరటమే విచిత్రంగా ఉంది. మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తప్పులన్నీ తమలోనే పెట్టుకుని కూడా చంద్రబాబు, టిడిపి నేతలు పోలీసులపై నోటికొచ్చినట్లు విరుచుకుపడటం. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అనుమతిలో పోలీసులు పెట్టిన కండీషన్లను టిడిపి యధేచ్చగా ఉల్లంఘించింది.  చంద్రబాబును రిసీవ్ చేసుకోవటానికి, ఆయన కాన్వాయ్ లో కేవలం ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలను మాత్రమే రావాలని పోలీసులు తమ అనుమతిలోనే స్పష్టంగా చెప్పారు.

 

చంద్రబాబు పర్యటించే మార్గంలో ఎట్టి పరిస్ధితుల్లోను భారీగా కార్యకర్తలను మోహరించటం, సభలు నిర్వహించటం లాంటివి చేయకూడదని షరతులు విధించారు. తమ అనుమతిని ఏ రూపంలో ఉల్లంఘించినా ముందస్తు సమాచారం లేకుండానే అనుమతిని రద్దు చేస్తామని కూడా రాతమూలకంగా ఇచ్చిన అనుమతిలోనే పోలీసులు స్పష్టంగా చెప్పారు. అంటే చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఇచ్చింది షరతులతో కూడిన అనుమతి మాత్రమే.

 

మరి పోలీసులు చెప్పినట్లుగానే విమానాశ్రయానికి ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలు మాత్రమే వచ్చారా ? అంత భారీ సంఖ్యలో కార్యకర్తలు ఎలా చేరుకున్నారు ?  అంటే ఇక్కడే పోలీసులు ఇచ్చిన అనుమతులను టిడిపి యధేచ్చగా ఉల్లంఘించిన విషయం అర్ధమైపోతోంది. ముందుగానే చెప్పినట్లు తాము ఇచ్చిన షరతులతో కూడిన అనుమతిని టిడిపి నేతలు ఉల్లంఘించారు కాబట్టే వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును పోలీసులు బలవంతంగా హైదరాబాద్ కు తిప్పి పంపేశారు. ఇపుడు కోర్టులో  తమ ఉల్లంఘనలు బయటపడితే చంద్రబాబు పరిస్ధేంటి ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: