ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెల్లుతుంది.. ఇప్పుడు నడుస్తున్నదంతా ఎలక్ట్రానిక్ యుగం.. ఇక ముందు ముందుకు కూడ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతుంది అని ఇప్పటికే వస్తున్న మార్పుల వల్ల గమనించ వచ్చూ.. ఇదే కాకుండా ఎప్పటి నుండో విద్యుత్ విషయంలో ఒక వార్త ప్రచారం అవుతుంది.. అదేమంటే ఇంటి నుండే విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని, ఇకనుండి మీరు మొబైల్ రిచార్జ్ చేసుకున్నట్లుగా.. మీ కరెంటును కూడా రీచార్జ్ చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే.. ఇలా రిచార్జ్ చేసుకున్న కరెంటును రోజువారిగా మీరు ఎంతవరకు ఉపయోగిస్తే అంత అమౌంట్ అందులో నుండి తగ్గిపోతుంది.. ఇది అచ్చంగా మొబైల్‌లో డబ్బులు రిచార్జ్ చేసుకుని ఎంత మాట్లాడితే అంత పైసలు కట్ అయినట్లుగా అన్న మాట..

 

 

ఇకపోతే ఆ కరెంట్ మీటర్లో డబ్బులు గనుక అయిపోతే మీ కరెంట్ కనెక్షన్ అటోమెటిగా కట్ అయిపోతుంది.. అచ్చం రిచార్జ్ చేయకుంటే సెల్ ఫోన్ అవుట్‌గోయింగ్ ఆగిపోయినట్లుగా అన్న మాట.. ఇక ఒక రకంగా ఈ వార్త విద్యుత్ వినియోగ దారులకు షాకింగ్ న్యూస్. అయితే క్రమం తప్పకుండా, సకాలంలో బిల్లును కట్టేవారు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. ఇక ఈ స్మార్ట్ మీటర్లను త్వరలోనే దేశమంతటా అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందుందట.. ప్రస్తుతం ‘ప్రభుత్వ స్మార్ట్ మీటర్ జాతీయ కార్యక్రమం’లో భాగంగా సుమారు 10 లక్షల స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు.

 

 

ఈ విధానంలో భాగంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బీహార్ నగరాల్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చామని.. దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదే కాకుండా రోజువారిగా ఇంట్లో వినియోగించే విద్యుత్ కంటే ఒక వేళ అధిక లోడ్ ఉంటే.. వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఆ లోడ్ అంతా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ సప్లయ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. అంతేకాక ఓవర్ లోడ్ కూడా కాదు. ఇక ఏ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎంత విద్యుత్ వస్తోంది.. అది ఎక్కడ వినియోగించబడింది అనే అంశాలు అన్నీ కూడా ఎనర్జీ ఆడిట్‌లో ఉంటాయట.. సో విద్యుత్ చోరుల ఆటలు ఈ విధానం అమలు జరిగితే సాగవన్నమాట...

 

మరింత సమాచారం తెలుసుకోండి: