ఆదివాసీల కోసం పోరాడిన యోధుడి మ్యూజియం మూతపడే స్థితికి చేరుకుంది. గ్రామస్తులు, సిబ్బంది మధ్య గొడవలతో దాని మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో జోడే ఘాట్‌కు వస్తున్న పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది.

 

జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడి గుర్తుగా కుమ్రంభీం పోరుగడ్డ జోడేఘాట్ 25 కోట్లతో నిర్మించిన మ్యూజియం ఆపదలో పడింది.  జోడేఘాట్ గ్రామ ప్రజలకు మ్యూజియం సిబ్బందికి మధ్య వివాదం కాస్త ముదరండంతో కేవలం మ్యూజియం తప్పా మిగతా వన్ని గదులకు తాళాలే దర్శనమిస్తున్నాయి..

 

జోడేఘాట్‌కు చెందిన స్మశాన వాటిక స్థల విషయంలో గ్రామస్తులు, మ్యూజియం సిబ్బందికి వివాదం తలెత్తింది. మ్యూజియం నుండి సుమారు వంద మీటర్ల అవతల గతంలో స్మశానం ఉన్న ప్రాంతంలోనే నూతనంగా వాటిక నిర్మించాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. ప్రభుత్వం కూడా అందుకు అనుమతిచింది. కానీ ఆ స్థలం మ్యూజియం పరిధిలోకి వస్తుందని సిబ్బంది వాదిస్తున్నారు. దీంతో గ్రామస్తులు, సిబ్బంది మధ్య గొడవలతో మ్యూజియంలోని పలు గదులకు తాళాలు పడ్డాయి. జోడేఘాట్ సమీపంలో స్మశానం ఏర్పాటు చేయవద్దని సిబ్బంది వాదిస్తున్నారు. కానీ గ్రామస్తులు ఇందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలం అయింది.

 

ఈ వివాదం కారణంగా మ్యూజియం సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి విధులకు దూరంగా ఉన్నారు. దీంతో అక్కడే ఉన్న హాస్టల్‌ హెచ్‌ఎంకు తాత్కాలింకంగా మ్యూజియం బాధ్యతలు అప్పగించారు. మ్యూజియానికి  సంబంధించిన కొన్ని గదుల తాళాలతో పాటూ మరుగుదొడ్ల తాళాలు కూడా మ్యూజియం సిబ్బంది వద్ద ఉండిపోవడంతో  సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.

 

గ్రామస్తులు, మ్యూజియం సిబ్బంది....ఇలా ఇద్దరూ తమ పంతం వీడటం లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సిబ్బందిని తొలగించి....నూతన సిబ్బందిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: