భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి కొంత మంది వ్యతిరేకంగా మరియు కొందరు అనుకూలంగా దేశ రాజధాని ఢిల్లీలో చేసిన హింస అల్లర్లలో దాగి ఉన్న ఘోరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జంతువుల తరహాలో ఇష్టమొచ్చినట్లు ఒకరినొకరు హతం చేసుకొని మురికి కాలువలో పడేసిన తీరు ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది.

 

మనుషులలో విచక్షణ జ్ఞానం మరియు మానవత్వం పూర్తిగా లోపించిన తరుణంలో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క హత్య అతి దారుణమైన సంకేతాలను పంపిస్తుంది. అంకిత్ శర్మ అనే ఐబి ఆఫీసర్ ను అయితే ఆరు గంటల పాటు శరీరంలో అన్ని అవయవాలపై 400 కత్తి పోట్లు పొడిచి పేగులు బయటకు తీసి నరకం చూపించి చంపారని వైద్యులు పోస్టుమార్టంలో తేలడంతో అసలు మారణకాండ ఎంత దారుణంగా జరిగిందో ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

 

ఇప్పటివరకూ 38 మంది చనిపోయినట్లు అధికారికంగా తేలగా ఇంకా వందల మంది మృతదేహాలు గల్లంతయ్యాయి. తరుణంలో పరిస్థితి చక్కబడ్డాక మృతదేహాల కోసం వెతకడం ప్రారంభిస్తే చాలా మంది మృతదేహాలు మరీ ఘోరంగా మురికి కాలువలో దొరికాయి. అంతేకాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ దొరికిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తూ ఉండడంతో చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుండడం చాలా ఘోరం. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా.... ఇంటెలిజెన్స్ మాత్రం అంతా నివురుగప్పిన నిప్పులా ఉందని ఇంకా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతోంది.

 

అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం జరగగా వీటిసి సంబంధించి భాధ్యులుగా 130 మందిని అరెస్టు చేశారు దాదాపు 400 మందిని అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన బాధితులకు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఇల్లు దుకాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులకు రూ.10లక్షలు ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: