పామును చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.  ఎక్కడ అది కాటేస్తుందో అని భయపడతారు.  పామును చూస్తే మనిషికి ఎంత భయమో, మనిషిని చూసినా పాముకు అంతే భయం వేస్తుంది.  అందుకే మనిషిని చూసి పాము పారిపోవాలని అనుకుంటుంది.  పామును చూసి మనిషి పారిపోవాలని అనుకుంటారు.  అయితే అన్ని పాములు కాటేస్తాయా అంటే కాదు.  కాటేసినా, విషం ఉంటుందా అంటే ఉండదు.  కేవలం కొన్ని జాతులు మాత్రమే విషపూరితమైనవి.  మిగతావి విష సర్పాలు కాదు.  


ఇక కొండచిలువల గురించి చెప్పాలి అంటే ఇవి పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి.  ఇవి మనిషిని కాటేయవు.  చుట్టేసి చంపేసి మింగేస్తాయి. అందుకే మాములు పాముల కంటే కూడా కొండచిలువలు యమా డేంజర్.  మన దగ్గర ఈ కొండచిలువలు తక్కువగా కనిపిస్తుంటాయి.  కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఎక్కడపడితే అక్కడ ఈ కొండచిలువలు కనిపిస్తుంటాయి.  ఇళ్లలోకి వచేస్తుంటాయి. బెడ్ రూమ్ లలోకి దూరుతుంటాయి.  


ఇలా ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లోకి కొండచిలువ దూరింది.  అలా ఇంట్లోకి దూరిన ఆ పాము ఆహరం కోసం వెతగ్గా బెడ్ రూమ్ లో ఓ టవల్ కనిపించింది.  ఆ టవల్ ను చూసి అదే ఆహరం అనుకోని పాపం మెల్లిగా మింగేసింది.  రుచిలేకపోయినా కడుపునిండితే చాలు అనుకోని మింగేసింది కొండచిలువ.  అలా మింగిన తరువాత పాపం అది అరిగించుకోలేకపోయింది.  ఒక్కోసారి తిన్న ఆహరం అరగకపోతే, ఈ పాములు మరణిస్తుంటాయి.

 
పాపం టవల్ ను మింగేసిన కొండచిలువ అరిగించుకోలేక అవస్థలు పడింది. ఆ టవల్ ను బయటకు కక్కేందుకు చాలా ప్రయత్నం చేసింది.  కానీ, ఫలించలేదు. దాని అవస్థలు చూసి జాలిపడిన ఇంట్లోని వ్యక్తులు స్నేక్ ఫ్రెండ్స్ కు కాల్ చేశారు.  అలా వచ్చిన స్నేక్ ఫ్రెండ్స్ కొండచిలువ కడుపులో నుంచి టవల్ ను కష్టపడి బయటకు తీశారు.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  ఈ న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: