ఇప్పుడు ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీపై ప్రతి చిన్న విషయానికి వేలెత్తి చూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.  గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ని మట్టి కరిపించింది వైసీపీ.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన విషయంలో దూకుడు పెంచారు.  ఈ నేపథ్యంలో ఆయన తీసుకు వస్తున్న పథకాలు ప్రతిపక్ష నేతలకు మింగుడు పడకుండా ఉంది.  అయితే ఇటీవల సీఎం జగన్ మూడు రాజధానుల గురించి ప్రస్తావన తెచ్చిన తర్వాత  అమరావతిలో పెద్ద ఎత్తున గొడవలు, ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.  పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు అయితే బాగుంటుందని జగన్ అభిప్రాయ పడ్డారు.. అందుకు నేతలు కూడా సై అన్నారు.  

 

కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు రాయలసీమ యాత్ర చేశారు.. అక్కడ కొంత మంది రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లాడు చంద్రబాబు నాయుడు.  అక్కడ కూడా ఆయనకు ఛేదు అనుభవమే మిగిలింది.  ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గకపోవడంతో ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారని అన్నారు. 

 

చంద్రబాబు ఇలా చైతన్య యాత్రలు చేసి ఎవరి నోటి కాడ కూడు లాగేయాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం చేస్తున్నారు. ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?' అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: