ఉత్తర ప్రదేశ్ లోని బండ సిటీ లో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. వివరాలు తెలుసుకుంటే... నరాయిని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లాహురేటా గ్రామంలో ఫిబ్రవరి 4వ తేదీన అంబికా ప్రసాద్ అనే ఒక రైతు తన పొలంలో ఓ ఎద్దుని కట్టేసి ఉంచాడు. ఆపై వేరే వైపు ఉన్న తన మరో పోలం కి వెళ్ళాడు. ఇంతలో ఇద్దరు నీచులు కట్టేసి ఉన్న ఎద్దుని పట్టుకొని దాని నాలుక ని కిరాతంగా కోసేశారు. తెగిపోయిన నాలుకని తమతో పాటు పట్టుకుపోయి తినేశారు.



ఐతే ప్రసాద్ తన ఎద్దుని ఇంటికి తీసుకెళదామని తిరిగి వచ్చినప్పుడు... అక్కడ గట్టిగ అరుస్తున్న తన ఎద్దు కనిపించింది. అలాగే దాని నోటి నుండి తీవ్రంగా రక్తం కారడం కనిపించింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘంతపోయిన రైతు ఏం జరిగిందో తెలియక ఎద్దు పరిస్థితి చూసి చాలా బాధపడుతూ దానిని ఇంటికి తీసుకెళ్లాడు. నాలుక కట్ అవ్వడంతో ఆ నొప్పిని భరించలేక ఆ ఎద్దు పడిన బాధ వర్ణించలేనిది. దాని బాధ ప్రత్యక్షంగా చూసి రైతు కూడా కంటతడి పెట్టుకున్నాడు.



అయితే నాలుగు రోజులు గడిచాక.. ఎద్దు నోటి నుండి రక్తం కారడం తగ్గిపోయింది. దీంతో మళ్ళీ తన ఎద్దుని తన పొలంలో కట్టేసి ఉంచగా... నాలుక కత్తిరించిన ఇద్దరు వ్యక్తులు మళ్ళీ ఆ ఎద్దుపై దాడి చేసేందుకు వచ్చారు. అప్పుడే రైతు వారిని చూసాడు. షాక్ అయిన ఆ ఇద్దరు రైతు కు వార్నింగ్ ఇస్తూ... 'ఈ విషయం ఎవరికైనా చెబితే నీ నాలుక కూడా కత్తిరిస్తాం', అని చెప్పి వెళ్లిపోయారు. పాపం, ఆ ఎద్దు ఎన్ని రోజులు అయినా ఏం తినకపోవడంతో... దానికి ఆ పరిస్థితి తెచ్చిన వారిపై కంప్లైంట్ ఇవ్వాలని భావించిన ప్రసాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. దీంతో పోలీసులు నిందితులపై 429 జంతు క్రూరత్వం చట్టం కింద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: