తెలంగాణ ఆర్థిక‌మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ కీల‌క నేత‌. ఆయ‌న ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారారు. ఇక త‌న మామ‌, సీఎం కేసీఆర్ త‌ప్పుకున్న త‌ర్వాత హ‌రీష్‌రావు సిద్ధిపేట‌ను త‌న కంచుకోట‌గా మార్చుకున్నారు. సిద్ధిపేట‌లో హ‌రీష్ రావు మెజార్టీ ప్ర‌తి ఎన్నిక‌కు పెరుగుతూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఏకంగా ఆ మెజార్టీ 1.20 లక్ష‌ల‌ను క్రాస్ చేసింది. ఇక ఇప్ప‌టికే సిద్దిపేట‌లో హ‌రీష్ రావు 2004 ఉప ఎన్నిక నుంచి గెల‌స్తూ రావ‌డంతో పాటు డ‌బుల్ హ్యాట్రిక్ సైతం కొట్టేశారు.



ఇక ఇప్పుడు హ‌రీష్ రావు క‌న్ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గం పై ప‌డిన‌ట్లు తెలంగాణ రాజకీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏంట‌నుకుంటున్నారా ?  సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మొన్న అధికార పార్టీ గెలుపులో హ‌రీష్ రావు ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఇప్పుడు హ‌రీష్ రావు సిద్ధిపేట‌ను మిన‌హాయిస్తే సంగారెడ్డి పైనే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నార‌ట‌.



సంగారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట. ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. మెద‌క్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక సీటు సంగారెడ్డి. అంతే కాకుండా ఇక్క‌డ జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో హరీష్ రావును బహిరంగంగా దూషించారు. దీంతో జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి ఎలాగైనా షాక్ ఇవ్వాల‌నుకున్న హ‌రీష్ రావు పట్టుబ‌ట్టి మ‌రీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేశారు.



ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సిద్ధిపేట‌లో అవ‌స‌ర‌మైతే త‌న భార్య‌ను అయినా పోటీ చేయించి.. తాను సంగారెడ్డిలో పోటీ చేసి అయినా జ‌య‌ప్ర‌కాష్ రెడ్డిని ఓడించి.. ఆయ‌న రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌ల‌కాల‌న్న‌నంత క‌సితో హ‌రీష్ రావు ఉన్నార‌ట‌. అందుకే ఆయ‌న ఇక్క‌డ బాగా ఫోక‌స్ చేస్తున్నార‌న్న వార్త‌లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మ‌రి హ‌రీష్ మ‌న‌స్సులో ఏముందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: