చిన్నపిల్లల అన్న తర్వాత ఎన్నో చిలిపి పనులతో పాటు ఎన్నో  కోతి పనులు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చేసే చిలిపి పనులు ప్రమాదానికి కూడా దారి తీస్తుంటాయి. ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. చిన్నారులు ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ గోడ సందులోకి వెళ్లారూ. ఇంకేముంది ఆ గోడ సందులోకి వెళ్లాడం అయితే వెళ్లారు కానీ రావడం మాత్రం ఆ చిన్నారులకు కష్టం గా మారిపోయింది. దీంతో అక్కడ ఇరుక్కుపోయారు. ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా భయపడిపోయారు చిన్నారులు. ఇక గట్టిగా అరిచేసరికి స్థానికులు గుర్తించి ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇది ఎక్కడో  జరిగింది అనుకునేరు. పాఠశాలలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... స్కూలుకు ప్రహరీ గోడ వద్ద చిన్నారులు ఆడుకుంటూ రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి లో చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు పాఠశాలలో ఆడుకుంటున్నారు. తాడేపల్లి నూకల పేట ఉర్దూ పాఠశాలలో చిన్నారులు ఆడుకుంటూ ప్రహరి గోడ మధ్యలో కి వెళ్లారు. వెళ్లడం సులభంగానే వెళ్లారు కానీ ఆ తర్వాత అక్కడ ఇరుక్కుపోయారు చిన్నారులు. ఇక చాలా సేపటి వరకూ అక్కడ నుంచి బయటపడాలని ప్రయత్నించినప్పటికీ ఆ చిన్నారులు బయటపడలేక పోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా.... గోడ  సందులో ఇరుక్కున్న చిన్నారులకు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారని  స్థానికులు గుర్తించారు. 

 

 

 ఇక అక్కడ ఇరుక్కున్నది రమణబాబు మూన్నాలుగా  గుర్తించారు. కాగా ఇద్దరు పిల్లల వయస్సు నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఇక వారిద్దరిని చాకచక్యంగా పాఠశాల సిబ్బంది స్థానికులు కలిసి బయటకు తీశారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వారిద్దరూ ఆ చిన్న ఇరుకులో ఎలా వెళ్లారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు పాఠశాలలో విద్యాభ్యాసం కోసం వచ్చే వారు కాదని అటు పాఠశాల సిబ్బంది కూడా తెలిపారు. తల్లిదండ్రులు అంత నిర్లక్ష్యంగా తమ పిల్లలను ఎలా వదిలి వెళ్లారు అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: