రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారికి స‌హ‌జంగానే స్వ‌లాభం, ప‌ద‌వీ కాంక్ష ఉంటాయి. అయితే, అదేస‌య‌మంలో త‌మ ను రాజ‌కీయంగా పైకి తీసుకువ‌చ్చిన పార్టీకి ఇబ్బందులు ఏర్ప‌డిన‌ప్పుడు అంతో ఇంతో ఆదుకునేందు కు,  నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. గ‌ల్లీ స్థాయి నేత‌ల్లో కూడా త‌మ పార్టీకి ఏదైనా ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు ర‌క్తం మ‌రిగిపోతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి. వారు కూడా త‌మ‌దైన రీతిలో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డమో.. లేదా మీడియా మీటింగ్ పెట్టి వ్యాఖ్యానించ‌డమో చేస్తారు. కానీ, ఇప్పుడు విశాఖ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌, త‌ద‌నం త‌ర  ప‌రిణామాల నేప‌థ్యంలో అక్క‌టి టీడీపీ నాయ‌కుడు, ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు త‌న స్థాయికి త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



గురువారం రోజు రోజంతా కూడా విశాఖ విమానాశ్ర‌యం అట్టుడికింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబును న‌గ రంలోకి అడుగు పెట్ట‌కుండా జ‌రిగిన ఈ ప‌రిణామంపై పార్టీల‌కు అతీతంగా కూడా కొంద‌రు స్పందించారు. ఇక‌, టీడీపీనాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. చంద్ర‌బాబును అవ‌మానించా రంటూ.. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. న‌ల్ల‌జెండాలు ప‌ట్టుకుని నినాదాలు చేశారు. అయితే, కీల‌క‌మైన విశా ఖలో మాత్రం ప్ర‌ధాన నాయ‌కులు ఎవ‌రు కూడా ముందుకు రాలేదు. బాబుకు జ‌రిగిన ప‌రాబ‌వంపై ఎవ‌రూ నోరు కూడా మెద‌ప‌లేదు. మ‌రీ ముఖ్యంగా గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించిన గంటా శ్రీనివాస‌రావు కూడా బ‌య‌ట‌కు రాలేదు.



దీంతో.. విశాఖ టీడీపీ నేత‌లు.. పార్టీని వాడుకుని.. అనుభ‌వించి.. వ‌దిలేయ‌డ‌మనే కాన్సెప్టును ఎంచుకు న్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా విశాఖ టీడీపీ నుంచి ఏ ఒక్క‌రూ మీడియా ముందుకు కూడా రాలేదు. గ‌తంలో విశాఖ‌లో జ‌గ‌న్‌ను అవ‌మానించిన‌ప్పుడు.. వైసీపీ నాయ‌కులు ము ఖ్యంగా విశాఖ‌కు చెందిన నాయ‌కులు క‌నీసం ఒక‌రిద్ద‌రు మీడియా ముందుకు వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఇంత పెద్ద అవ‌మానం జ‌రిగితే.. స్పందించేందుకు నాయ‌కులు లేరా?  ఉన్నా రాలేదా? అంటే .. రాలేద‌నే చెప్పాలి. విశాఖ‌లో నాలుగు సీట్లు గెలుచుకున్న సంతోషం క‌న్నా.. ఇప్పుడు ఎదురైన ఆవేద‌న పార్టీని మ‌రింత‌గా కుంగ‌దీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: