దేశంలో ఎక్కడ ఎలాంటి అలజడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి.  హైదరాబాద్ లో సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి.  మతసామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ నగరం కనిపిస్తుంది.  భిన్నత్వంలో ఏకత్వం మనకు హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తుంది.  అందుకే హైదరాబాద్ నగరంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఏడేళ్ల క్రితం దిల్ షుఖ్ నగర్ లో జంట బాంబు పేలుళ్ల తరువాత నగరం ఇప్పటికి భయం భయంగానే ఉంటోంది.  


కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అల్లర్లు చెలరేగడంతో హైదరాబాద్ లో కూడా అలంటి అల్లర్లు చెలరేగుతాయేమో అని భయపడుతున్నారు.  అలాంటిది ఏమి లేదని పోలీసులు చెప్తున్నా వినడం లేదు. కారణం చాలా ఉన్నాయి.  ఇటీవలే హైదరాబాద్ లో కూడా సిఏఏ కు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.  ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు హైదరాబాద్ లో సడెన్ గా ఆక్టోపస్ కమెండోలో కవాతు చేశారు.  తనిఖీలు నిర్వహించారు.  ప్రత్యేకంగా హెలీకాఫ్టర్లో దిగిన వీరు దిల్ సుఖ్ నగర్, మలక్ పెట్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.  ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియక ప్రజలు భయపడుతూ ఎక్కడి వ్యక్తులు అక్కడే నిలబడిపోయారు.  దుకాణాలు, ఆగి ఉన్న వాహనాలను చెక్ చేశారు.  


రెగ్యులర్ మాక్ డ్రిల్ లో భాగంగా ఇలా చేసినట్టు అక్టోపర్ కమెండోలు పేర్కొన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి ఎలా ప్రజలను రక్షించాలి దానిపై ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారట.  ప్రజలను అలర్ట్ చేయడానికి కూడా ఇలా చేస్తుంటారని అంటున్నారు.  ఇలాంటి డ్రిల్స్ చేయడం మంచిదే.  ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం పడుతుందో చెప్పలేము కదా.  అన్ని సమయాల్లో అలర్ట్ గా ఉండాలి.  అన్నింటిని ఎదుర్కొనే విధంగా ప్రజలు కూడా సిద్ధం ఉండాలి.  అప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: