సాధారణంగా జేసీబీ అంటే ఎక్కడైనా గుంతలు తవ్వడానికి.. లేదా ఎక్కడైనా చెత్తా చెదారాలు, చెట్లు పెరిగితే వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంటారు.  లేదా ఏదైనా కట్టడాలను కూల్చడానికి అక్కడ ఉన్నవాటిని వేరే చోటకు మార్చడానికి జేసీబీలను ఉపయోగిస్తుంటారు.  కానీ గుజరాత్ లో మాత్రం జేసీబీనీ తవ్వడానికి మాత్రమే కాదు.. వేరే రకంగా కూడా ఉపయోగించుకోవొచ్చు అని అక్కడ మహిళలు నిరూపించారు.  జేసీబీ అంటే పది మంది చేసే పని ఒక్క మిషిన్ తో చేయించవొచ్చు.  అలాంటిది గుజరాత్ లో కొంత మంది మహిళలు చేసిన విడ్డూరం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  

 

ఇంతకీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే..  కొందరు మహిళలు లారీలో ఎక్కారు.. వారు కిందకు దిగాలంటే ఏ స్టూలో, కుర్చీనో, చిన్నపాటి నిచ్చెనో సాయంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మహిళల్ని లారీలో నుంచి జేసీబీతో కిందకు దించారు. వారంతా ఆ లారీ నుంచి జేసీబీ కి ముందు ఉండే పెద్ద తొట్టెం లాంటి దానిలో నిల్చునొ చిన్నగా కిందకు దిగారు. అక్కడ మహిళలు ఉన్న లారీ వద్దకు తొట్టెలాంటిదాన్ని డీసీఎం దగ్గరు చేర్చాడు జేసీబీ డ్రైవర్. జేసీబీ ద్వారా డీసీఎం నుంచి కిందకు దిగుతూ నవ్వు ఆపుకోలేకపోయారు ఆ మహిళలు. కిలకిలా నవ్వుకుంటూ కిందకు దిగారు.

 

 మొత్తానికి ఇక్కడ మహిళలకు వచ్చిందో.. లేదా ఆ లారీ డ్రవర్ కి వచ్చిందో.. లేదా జేసీబీ వాడే వారికి వచ్చిందో కానీ ఈ ఐడియా మాత్రం బాగా వర్క్ ఔట్ అయ్యింది.  గుజరాత్‌లో జరిగిన ఈ దృశ్యానికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.  ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు టిక్ టాక్ లు, వీడియోలుగా వస్తున్నాయి.  మంచి ఎంట్రటైన్ మెంట్ గా కూడా ఉంటున్నాయి. తాజాగా గుజరాత్ లో జరిగిన ఈ కామెడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: