ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైద్యం చేయాల్సిన డాక్టర్లు కూడా కామం తో ఊగిపోయిన మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కానీ చివరిలో అసలు విషయం బయటపడింది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక అదే ఆసుపత్రిలో ఉండే ఆయన కొడుకు కూడా సదరు మహిళ పై మరోసారి రేప్ చేశాడు. ఇక ఈ విషయంపై  పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళా . 

 

 

 ఇదిలా ఉంటే సడన్ గా ఓ రోజు అత్యాచార ఆరోపణలు ఎదురుకుంటున్న  సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన విషయాలకు పోలీసులు షాక్ అయ్యారు. పూణే లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూణే కి చెందిన ఓ మహిళ తన పై డాక్టర్ తో  అతని కొడుకు కూడా అత్యాచారం చేశాడని... వైద్యం కోసం వెళ్తే తన జీవితం నాశనం చేశారు అంటూ గగ్గోలు పెడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ అత్యాచార కేసు నుంచి బయట పడేస్తానంటూ ఓ వ్యక్తి తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడని. ఏకంగా అతనికి 1.3 కోట్ల వరకు ఇచ్చామని... అలా డబ్బులు చెల్లించకపోతే ఎన్నో ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ సదరు వ్యక్తి మిమ్మల్ని బెదిరించాడు అంటూ... అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. 

 

 

 

 ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించిన... ఆ వ్యక్తి ఇంకా డబ్బులను డిమాండ్ చేస్తుండడంతో చివరికి తాను  పోలీసులను ఆశ్రయించినట్లు డాక్టర్ తెలిపాడు. అయితే రేప్  చేశామంటూ ఫిర్యాదు చేసిన మహిళతో బిల్లు విషయంలో గొడవ జరిగింది అని సదరు డాక్టర్ తెలిపాడు. అంతే కాకుండా సదరు మహిళ దళిత మహిళ కావడంతో... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడితే ఎక్కువ శిక్ష పడుతుందని సదరు వ్యక్తి తమను  బెదిరించినట్లు పోలీసులకు వివరించాడు. ఇక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫిర్యాదు మేరకు... అక్రమ వసూళ్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: