అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు... ఎప్పుడు అనుమానంతో బతుకుతుంటే పక్క వాళ్ళు ఏం చేసిన దాని పై అనుమానం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల దాంపత్యం బలంగా ఉండాలి అంటే కావాల్సింది నమ్మకం. దంపతులిద్దరి మధ్య ఎంత నమ్మకం ఉంటే దాంపత్య బంధం అంత బలంగా ఉంటుంది. అదే భార్య భర్తలు ఇద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం మొదలైంది అనుకోండి. అది ఎక్కడ వరకు దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి. కొంచెం అయినా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఎప్పుడూ పక్క వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని మోసం చేస్తున్నారనే  భావన మనసులో కలుగుతూనే ఉంటుంది. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం లేదా హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. 

 

 

 ఇక్కడ అనుమానం ఓ కుటుంబాన్ని చంపేసింది. భార్య కొత్త వ్యక్తులతో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుంది అనే అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలతో పాటు భార్యను  కూడా అతి కిరాతకంగా చంపి... చివరికి అతను కూడా ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లోని అర్థాలకు చెందిన ఓ వ్యక్తి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లపాటు భార్యాభర్తలిద్దరూ ఎంతో హాయిగా కాపురం చేశారు. కానీ వీరిద్దరి కాపురంలో అనుమానం అనే భూతం ప్రవేశించింది. ఈ క్రమంలోనే భార్య అపరిచితులతో తరచూ ఫోన్లో మాట్లాడుతుంది అనే కారణంతో... ఈ భార్యభర్తలిద్దరు మధ్య తరచూ గొడవలు అయినవి. ఇక ఈ గొడవలు రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. 

 

 

 ఇక తాజాగా ఇలాగే  భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగి అసహనానికి లోనైనా భర్త... భార్య సహా పిల్లలను కూడా హత్య చేసేందుకు వెనకాడలేదు.స్థానికులు వచ్చి చూసేసరికి భర్త ఫ్యాన్ కు  ఉరివేసుకొని ఉండగా భార్య ఇద్దరు పిల్లలు కింద పడి ఉన్నారు.ఇక  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్లో భార్య సహా భార్య సోదరులపై ఆరోపణలు చేశాడు ఆ వ్యక్తి. భార్య అపరిచితులతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని...అందుకే భార్య పిల్లల గొంతు కోసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు ఆ వ్యక్తి.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా  అనుమానం పెనుభూతం ఒక కుటుంబాన్ని మొత్తం చంపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: