ఆ మద్య తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ ని అత్యంత కృరంగా అత్యాచారం చేసి ఆపై దహనం చేసిన నలుగురు నింధితులను పోలీసులు 24 గంటల్లోనే అధినంలోకి తీసుకున్నారు.  దిశ అత్యాచార, హత్యపై దేశ వ్యాప్తంగా మహిళాలోకం భగ్గుమంది.  నింధితులను వెంటనే ఉరి తీయాలని.. లేదు ఎన్ కౌంటర్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.  అయితే నింధితులను కేసు దర్యాప్తు నిమిత్తం స్పాట్ కి తీసుకు వెళ్లగా నలుగురు నింధితులు ఆయుధాలతో తమపై దాడికి యత్నంచారని.. వారి నుంచి రక్షించుకోవడం కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు అధికారులు తెలిపారు.  ఇలా ఎన్ కౌంటర్ అయిన విషయం దేశ వ్యాప్తంగా తెలియడంతో పోలీసులపై హర్షాతిరేఖలు వెల్లువెత్తాయి. 

 

అలాంటి కృరమృగాళ్లకు దేవుడు పోలీసుల రూపంలో తగిన శిక్ష వేశారని సంతోషం ప్రకటింయారు దిశ తల్లిదండ్రులు, బంధువులు.. మహిళా సంఘాలు. అయితే నింధితుల కుటుంబాలు మాత్రం తాము అన్యాయం అయ్యామని.. తమకు దిక్కులేని పరిస్థితి నెలకొందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై CJI వాదించారు. దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

 

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయ విచారణకు కమిషన్‌ వేశామని, ఈ సమయంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. న్యాయ విచారణ కమిషన్‌ను కలిసే స్వతంత్రత ఇస్తున్నామన్న సీజేఐ, ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు తెలపాలని సూచించారు.  కమిషన్ నివేదిక ఇచ్చాక కూడా..న్యాయం జరగలేదని భావిస్తే...మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. CJI సూచనలతో న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: