మహారాష్ట్రలో ఎన్నో రాజకీయ పరిణామాల తర్వాత చివరికి ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిపదవులు కూడా మూడు పార్టీలు సమంగా పంచుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే  ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉన్నది దనికుల  కోసం కాదని కేవలం పేదల కోసం మాత్రమే అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేద ప్రజలకు చేయూత అందించే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను కూడా వెల్లడించారు. 

 

 

 ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర లోని అన్ని విద్యాసంస్థల్లో ముస్లింల అందరికీ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే దీనికి సంబంధించిన బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో  శాసన సభలో ప్రవేశపెట్టేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్  తెలిపారు. ఇక ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో... మహారాష్ట్ర లోని ముస్లిం సోదరులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 అయితే కేవలం విద్యాసంస్థల్లో నే కాదు ఉద్యోగాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని... దానికి సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకుని తర్వాత ఒక నిర్ణయానికి వస్తాము  అంటూ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల వల్ల గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసింది అంటూ ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది ఉద్దవ్ థాకరే  ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: