కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా కూడా ప్రపంచం కుదేలవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైనా చైనాను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. కానీ చైనాను దెబ్బ తీస్తే ఆ ప్రభావం ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు కదా..చైనా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పుగా మారింది.

 

 

ఎందుకంటే.. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా ప్రముఖ పాత్ర వహిస్తోంది. మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 13 శాతంగా ఉంది. చైనా ఎగుమతి చేసే ఔషధాలు, స్టీల్, ఇనుము వంటి ముడిపదార్థాలపై అనేక దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సమయంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో చైనాపై ఆధారపడిన అనేక దేశాల్లోని పరిశ్రమలు మూతపడే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా వెలుపల అనేక దేశాల్లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

 

 

అంతే కాదు.. కరోనా మూలంగా చైనాలో ఇతర దేశాలకు చెందిన ఫ్యాక్టరీలు, కంపెనీలు కూడా మూతపడ్డాయి. చమురు, రాగి, సోయాబీన్స్‌ లాంటి ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి అత్యధికంగా కొనుగోలు చేసే చైనా.. ఇప్పుడు వాటి జోలికి వెళ్లట్లేదు. దీంతో ఆయా వస్తువుల ధరలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మూడీస్ వంటి సంస్థల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

 

కరోనా వైరస్‌ వ్యాప్తితోప్రపంచ ఆర్థిక వృద్ధి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గాయని పీహెచ్డీసీసీఐ సంస్థ తెలిపింది. దీని విలువ 250 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటికే బ్రెగ్జిట్‌, వాణిజ్య యుద్ధం లాంటి సమస్యలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కొవిడ్‌-19 మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ మరింత తీవ్రంగా మారితే మరోసారి ప్రపంచం మాద్యం గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని మూడీస్‌ వంటి సంస్థలు కూుడా హెచ్చరిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: