ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎంత వేడి వేడిగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు కదా! ఆ మాత్రం వేడి వేడిగా ఉంటాయి. ఇకపోతే ఆ వేడి వేడి రాజకీయాలను మరింత వేడి చేసేది విమర్శలు.. ప్రతిపక్షాలు.. పాలకపక్షం ఎంత మంచి పని చేసిన విమర్శలు చేస్తూనే ఉంటాయి. 

 

అలాంటి విమర్శలను ఎదుర్కొని.. వాటికీ తనదైన శైలిలో విజయసాయి రెడ్డి సమాధానాలు చెప్తుంటారు.. విజయసాయి రెడ్డి ఒక్క ట్విట్ పెడితే చాలు అటువైపు ఉన్న వారు ఎవరైనా సరే నోరు మూసుకుంటారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 

 

గతంలో సీఎం జగన్ స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వస్తే అతన్ని.. ప్రజా ప్రతినిధులను ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపారు.. అయితే ఇప్పుడు కూడా సేమ్ సిన్ రిపీట్ అయ్యింది. చంద్రబాబు నిన్న ధర్మ పోరాటం అని అధర్మ పోరాటానికి దిగి ప్రజల మధ్య విష బీజాలు నాటాలి అనే ఆలోచనలో బయల్దేరిన చంద్రబాబుని వెనక్కు పంపారు. దీంతో అయన ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని ఫైర్ అయ్యారు.. దీనిపై విజయసాయి రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు  చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?'' అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: