భారత దేశంలో హిందూ.. ముస్లిం ఎంత సఖ్యతగా కలిసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకునే ఉర్సు ఉత్సవాలకు హిందువులు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటారు.  హిందువుల శుభకార్యాలకు ముస్లిం సోదరీ, సోదరులు సంతోషంగా రావడం చూస్తుంటారు.  అయితే కొంత మంది మత ఛాందసవాదులు ఎన్ని అడ్డుంకులు పెట్టినా.. కొన్ని చోట్ల ఇబ్బందులు కలుగుతాయి కానీ.. చాలా చోట్ల హిందూమూస్లింలు కలిసి మెలిసి ఉంటారు.  ఈ సఖ్యత ఇప్పటిది కాదు.. వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో పౌరసత్వ బిల్లుపై పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్నాయి.  ఇప్పటికే నలభై మందికి పైగా మృత్యువాత పడ్డారు.  కొంత మంది అసాంఘిక శక్తులు ఈ గొడవలకు కారణం అని అంటున్నారు. 

 

ఏది ఏమైనా దేశాన్ని కుదిపేస్తున్న ఈ దారుణమైన ఘటనలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం యువకుడు చేసిన పనికి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   హిందూ ముస్లిం భాయీ..భాయీ అనే మత సామరస్యం చాలా సందర్భాలలో మనం వింటున్నాం..చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలాంటి శుభలేఖలు చూస్తుంటే నిజంగా మన మద్య గిట్టని వాడు సృష్టిస్తున్న అవాంతరాలే అని నమ్మక మానరు.  ఉత్తరప్రదేశ్ మీరట్లోని హిస్తినాపూర్ ప్రాంతంలో నివాసముంటే మొహద్ సారఫత్ అనే ముస్లిం  తన కుమార్తె అస్మా ఖాటూన్  పెళ్లి చేస్తున్నాడు. మార్చి 4న ఈ వివాహం జరగనుంది.  ఈ శుభలేకపై హిందువులు ఎంతో భక్తితో కొలిచే వినాయకుడు... ప్రేమకు నిజరూపమైన రాధాకృష్ణులు బొమ్మలుతో అచ్చు వేయించారు. 

 

ఈ సందర్భంగా మొహద్ సారాఫత్ మాట్లాడుతూ..  ఈ మద్య దేశంలో ఎంతో మంది తమ స్వార్థం కోసం మత విద్వేషాలు సృష్టిస్తున్నారని.. ఇటువంటి సమయంలో నా కూతురు శుభలేఖలపై హిందూ దేవుళ్ల బొమ్మలు నా స్నేహితులు చాలా సంతోషిస్తున్నారని అన్నారు. నాకు ఇక్కడ చాలా మంది హిందూ స్నేహితులు ఉన్నారు. వారి ఇంట్లో ప్రతి శుభకార్యానికి పండుగలకు నన్ను ఆహ్వానిస్తుంటారని అన్నారు. మా స్నేహితులం అంతా హిందూ ముస్లింలనే తేడాలు లేకుండా స్నేహంగా ఉంటామని అందుకనే హిందూ-ముస్లింల స్నేహసంబంధాలను ఇలా నా కూతురు పెళ్లి పత్రికల్లో హిందూ దేవుళ్ల బొమ్మలను ప్రింట్ చేయించానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: