వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకి సవాల్ విసిరారు.  పులివెందుల నుండి రౌడీలను విశాఖపట్టణం తీసుకొచ్చినట్లు టిడిపి నాయకులు చేసిన విమర్శలను తిప్పి కొడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అవంతి శ్రీనివాస్ చాలెంజ్ విసిరారు. పులివెందుల నుండి  రౌడీలను తీసుకువచ్చారని నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని అవంతి సవాల్ చేశారు. అయితే.. నిరూపిస్తే మాత్రం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో చంద్రబాబుని  అడ్డుకున్న వారిలో అధికార పార్టీ ప్రమేయం లేదు అంటూ స్థానిక ప్రజలు చంద్రబాబు ని అడ్డుకోవడం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో చాలా వరకు మీడియా ఛానల్స్ ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబుని అడ్డుకున్నారని... ఇది పార్టీలకు  సంబంధించిన విషయం కాదని నిన్నంతా వార్తలు రాయడం జరిగింది.

 

అయితే ఇదే సందర్భంలో నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డులలో మంత్రిగారి బొమ్మలు, వైఎస్సార్ కాంగ్రెస్ పేర్లు ఉండటంతోపాటు జై జగన్ అంటూ అరవడంతో అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు  తాజాగా మీడియా మొత్తం బయట పడుతున్న తరుణంలో అంతా సక్సెస్ అనుకున్న టైంలో... జగన్ ని అవంతి శ్రీనివాస్ వేసిన ఛాలెంజ్ ఇరకాటంలో పెట్టినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా మరికొన్ని వీడియోల్లో నిరసనకారులకు చాలామంది బిర్యానీ పొట్లాలు పంచుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి.

 

ఇంకో వీడియోలో ఒక మహిళ తమకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వలేదని గొడవ పడుతున్నట్లు వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబుని అడ్డుకుంది వైసీపీ పార్టీ నాయకులు అని తాజాగా తేలిపోయింది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం చంద్రబాబుని వైసిపి నాయకులు మాత్రం అడ్డుకోవడం జరిగింది అని ఏపీ మీడియా తాజాగా వార్తలు ప్రసారం చేస్తుంది. ఎక్కడా కూడా అమరావతి రాజధాని ని సపోర్ట్ చేసిన చంద్రబాబుకి ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏమీ లేదని కావాలని వైసిపి నాయకులు చేస్తున్న కుట్ర అంటూ బాబు పర్యటన అడ్డుకోవడం పట్ల ఏపీ మీడియా ప్రస్తుతం వార్తలు ప్రచారం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: