జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది.. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి వచ్చింది లేదని విమర్శలు ఉన్నాయి. కొత్తవి రాకపోగా.. చంద్రబాబు హయాంలో వచ్చినవి కూడా జగన్ తీరుతో వెనక్కు వెళ్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ ఈ విషయాన్ని ప్రతిసారి హైలెట్ చేస్తోంది.

 

అందుకే పరిశ్రమలను ఆకర్షించే విషయంలో మరింత శ్రద్ధ వహించాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెబుతున్నారు. ప్రపంచంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త పాలసీ సిద్ధం చేశామన్నారు. పారిశ్రామికవేత్తలు సులువుగా పెట్టుబడులు పెట్టేందుకు సవరణలు చేశామన్నారు.

 

 

ప్రస్తుతం మిగతా రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో మరింత అభివృద్ధి చెందాలని మూడు పోర్టుల నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ అంగీకారం తెలిపారన్నారు. పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్యను పరిష్కారిస్తామని మేకపాటి గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నామని వివరించారు.

 

 

మరి గౌతమ్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా.. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారా.. ఇప్పటికే సైకో జగన్ సీఎంగా ఉంటే ఎవరూ పెట్టుబడులు పెట్టరని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. అందుకే తగిన రీతిలో సమాధానం చెప్పాలంటే ప్రతిష్టాత్మక కంపెనీలు ఏపీలో వస్తే అప్పుడు వైసీపీ కౌంటర్ విమర్శలు చేయొచ్చు. మరి జగన్, గౌతమ్ రెడ్డి ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: