విశాఖలో నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు వెళ్లగా అక్కడ వైకాపా నేతలు బాబును అడ్డుకున్న సంగతి తెలిసిందే.  దీంతో సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు.  వైకాపా నేతలు బాబును అడ్డుకోవడానికి గల కారణాలను గురించి తెలుగుదేశం పార్టీ ఇలా చెప్తూ వచ్చింది.  అవేమంటే పులివెందుల నుంచి అక్రంగా రౌడీలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అడ్డుకున్నారని ఆరోపించింది.  


వైకాపా నేతలు వైసిపి నేతలు ఎలాంటి భూకబ్జాలు, పేదల భూములను అన్యాయంగా లాక్కోలేదని నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  వైకా అరాచకాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని న్నారు.  విశాఖకు వచ్చే పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, పెట్టుబడులు వెనక్కి పోతుంటే అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బాబు తెలిపారు.  ప్రతిపక్ష నేతపై కోడిగుడ్లు, రాళ్ళూ చెప్పులతో దాడులు చేసినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.  


అమరావతిలో ఒక ఎంపీకి పూలు ఇచ్చినందుకు అట్రాసిటీ కేసులు నమోదు చేసారని, జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నేతపై ఎందుకు దాడికి దిగితే, దాడులు చేసిన వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబుపై దాడికి సంబంధిచిన ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటుగా కోర్టుకు కూడా నివేదిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  


రాష్ట్రం మొత్తాన్ని పులివెందుల పంచాయతీగా మార్చేందుకు జగన్ అండ్ కో కంకణం కట్టుకున్నారని, బాబు విశాఖకు చేరుకోక ముందే పులివెందుల గూండాలు, వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకొని దాడికి దిగారని అయన ఆరోపించారు.  300 మందికి పైగా ఉన్న పోలీసులు 10మంది వైకాపా కార్యకర్తలను ఎందుకు అడ్డుకోలేకపోయారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.  మరి ఈ ప్రశ్నలకు వైకాపా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: